Aadhaar Card Update: మీ ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలా..ఫోన్ నెంబర్ మార్చి అప్‌డేట్ చేయాలంటే ఇకపై చాలా సులభం. ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో మీరే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI)..ఆధార్ కార్డు కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇటీవల మరో సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. ఫలితంగా మీ పాత మొబైల్ నెంబర్‌ను మార్చి..కొత్త మొబైల్ నెంబర్ చేర్చవచ్చు లేదా కొత్తగా మరో నెంబర్ యాడ్ చేయవచ్చు.యూఐడీఏఐ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో ఇదెలా సాధ్యమో చూద్దాం.


మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ ( Mobile number update) కోసం ముందుగా మీరు UIDAI వెబ్‌సైట్ ask.uidai.gov.inను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు అప్‌డేట్ చేయాల్సిన ఫోన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ ఆప్షన్ ద్వారా మీ ఫోన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి..సబ్మిట్ ఓటీపీ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ ఎంచుకోండి. ఆ తరువాత డ్రాప్‌డౌన్ బాక్స్‌లో అప్‌డేట్ ఆధార్‌పై క్లిక్ చేసి కంటిన్యూ అవండి. తరువాత ఆధార్ (Aadhaar card)నెంబరు, పూర్తి పేరు నమోదు చేసి..అప్‌డేట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎంచుకుని ప్రొసీడ్ అవండి. మొబైల్ నెంబర్ సబ్మిట్ చేసిన తరువాత మొబైల్ నెంబర్, క్యాప్చా మరోసారి ఎంటర్ చేసి కొత్తగా వచ్చిన ఓటీపీని సరి చూసుకుని సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. అనంతరం 25 రూపాయల ఫీజు చెల్లించి అవసరమైన అదనపు సమాచారాన్ని నమోదు చేసి..దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. నిర్ధారిత సమయంలో ఆధార్ సేవాకేంద్రానిక వెళ్లి వివరాలు చెబితే సరిపోతుంది. మీ ఆధార్ కార్డు అప్‌డేట్(Aadhaar Card Update) పూర్తవుతుంది. 


Also read: Amazon prime day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ డిస్కౌంట్లు, జూలై 26, 27 తేదీల్లో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook