Viral Video of Anaconda Snake Chasing a Boy : సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆ వీడియోలు కూడా చూడ్డానికి ఎలా ఉంటాయంటే.. అచ్చం నిజంలా.. మన కళ్లను మనమే నమ్మలేకపోతున్నాం అనుకునేలా ఉంటాయి. కానీ ఆ వీడియోలను నిశితంగా పరిశీలించి చూస్తే కానీ అందులో ఎంత వాస్తవం ఉంది అనేది బోధపడే అవకాశం ఉండదు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? మరేం లేదండి.. ఇదిగో ఇప్పుడు మేం మీకు చూపించబోయే ఒక వీడియో కూడా అలాంటిదే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 155 మిలియన్ల మంది చూశారు. అంతలా జనం ఎగబడి చూడటానికి కారణం ఈ వీడియోలో ఉన్న అసాధారణమైన కంటెంట్ అనే చెప్పుకోవాలి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక బాలుడు పొలాల మధ్యలోంచి పరుగులు పెడుతున్నాడు. అతడి వెంటే ఒక పెద్ద అనకొండ పాము వెంటాడుతూ వెంటపడుతోంది. అతడు పరుగెడుతున్న కొద్దీ ఆ ఆనకొండ పాము అతడి వెంటే పరుగెడుతోంది. అది చాలా పెద్ద సైజ్ ఆనకొండలా కనిపిస్తోంది. 


ఇక్కడ రెండు అసాధారణమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆ ఆనకొండ పాము అతడిని వెంబడించడం అయితే.. మరొకటి ఆ ఆనకొండ సైజు అతి భారీగా ఉండటమే. వాస్తవానికి అలాంటి పాములను ఆనకొండ లాంటి సినిమాల్లో వీఎఫ్ఎక్స్ మాయాజాలంతో తప్పించి నిజ జీవితంలో అస్సలే చూడలేం. అందుకే నెటిజెన్స్ ఈ వీడియోను ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ వీడియో నిజమే అని భ్రమపడి చూసే వాళ్లు కొందరైతే... ఇది నిజమేనా కాదా అని క్రాస్ చెక్ చేసే ఉద్దేశంతో చూసే వాళ్లు ఇంకొంతమంది. ఇది నిజం కాదు కానీ.. ఇంత రియలిస్టిక్ గా ఇలా ఎలా చేశారబ్బా అనే ఆశ్చర్యంతో ఇంకొంత మంది చూస్తున్నారు. దీంతో ఈ వీడియోకు ఏకంగా 155 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.



 


పక్క ఫేక్ వీడియో
ఈ వీడియో రియల్ వీడియో కాదు అనే చెప్పాలి. ఇది ఎవరో ఔత్సాహికులైన వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టు తన గ్రాఫిక్స్ మాయాజాలం విద్యలను పరిక్షించుకుందుకు చేసిన ప్రయత్నమైనా అయ్యుండాలి లేదంటే.. సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని బోల్తా కొట్టించే ఉద్దేశంతో కావాలనే గ్రాఫిక్స్ లో చేసి మరి యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఉండాలి తప్పించి ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ వీడియో ఫేక్ అని ఎలా చెప్పగలరు అని అనుకుంటున్నారా ? ఈ వీడియోను తయారు చేసిన వ్యక్తి అంతా బాగానే మేనేజ్ చేశారు కానీ ఆ స్నేక్ మూమెంట్ ని చూస్తే కొంత అనుమానం రాకమానదు. అన్నింటికిమించి అంత పెద్ద సైజ్ ఆనకొండ పాములు దక్షిణాఫ్రికాలో, అమేజాన్ అడవుల్లో ఉన్నట్టుగా సినిమాల్లో చూడటమే కానీ మన ఇండియాలో మాత్రం అస్సలే లేవు. 


ఇది కూడా చదవండి : Man Died of Heart Attack: హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో రైల్వే గేటు వద్ద చిక్కుకుపోయిన అంబులెన్స్ !!


లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఆ పాము అతడిని చుట్టుకునేటప్పుడు అతడు ఏ మాత్రం కదలకుండా శిలలాగా నిలబడటం ఒకటైతే.. అతడిని చుట్టేసిన తరువాత పాము మొత్తం గాల్లోనే వేళ్లాడుతోందే తప్ప నేలపై ఎక్కడా బ్యాలెన్స్ కాలేదు. అంత భారీ కాయం ఉన్న ఏ జీవి అయినా నేలపై భారం వేసి నిలబడాల్సిందే కానీ అలా గాల్లో నిలబడే ఛాన్సే లేదు. ఒకవేల అది అతడిని ఆధారంగా చేసుకుని నిలుచుంది అని అనుకున్నా.. అంత పెద్ద పాము అతడిపైనే భారం వేసి చుట్టేస్తే అతడు కూడా నేలపై పడిపోవాలే కానీ అంత సింపుల్‌గా నిలబడలేడు. ఇది నెటిజెన్స్‌ని తప్పుదోవ పట్టించి, భారీ మొత్తంలో వ్యూస్ రాబట్టేందుకు చేసిన ఒక ఫేక్ వీడియో అని చెప్పడానికి ఈ మాత్రం చాలు. ఈ విషయం తెలియని కొంతమంది అమాయక జనం ఈ వైరల్ వీడియోను వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేసుకుంటూ మరీ వీక్షిస్తున్నారు.


ఇది కూడా చదవండి : Landslides Falling on Roads : కార్లు వెళ్తున్న రోడ్డుపై కుప్పకూలిన కొండచరియలు.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK