CI Swarnalatha Dance Videos: సీఐ స్వర్ణలత డాన్స్ వీడియోలు వైరల్.. సినిమాలోనూ నటిస్తున్న లేడీ పోలీసు

CI Swarnalatha Dance Videos Goes Viral: నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత జీవితంలో ఇంకా చాలా లీలలే ఉన్నాయని తెలుస్తోంది. స్వర్ణలతకు సినిమాల్లో నటించాలన్న కోరిక కూడా బలంగానే ఉందని తాజాగా ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెల్లడైంది. స్వర్ణలత డ్యాన్స్ రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 

Written by - Pavan | Last Updated : Jul 9, 2023, 04:55 AM IST
CI Swarnalatha Dance Videos: సీఐ స్వర్ణలత డాన్స్ వీడియోలు వైరల్.. సినిమాలోనూ నటిస్తున్న లేడీ పోలీసు

CI Swarnalatha Dance Videos Goes Viral: నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత జీవితంలో ఇంకా చాలా లీలలే ఉన్నాయని తెలుస్తోంది. స్వర్ణలతకు సినిమాల్లో నటించాలన్న కోరిక కూడా బలంగానే ఉందని తాజాగా ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెల్లడైంది. స్వర్ణలత డ్యాన్స్ రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. విశాఖపట్నంలో ఒక ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ వైఖరి ఇప్పుడు చర్చనియాంశంగా మారింది. నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో స్వర్ణలత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

ఆర్మ్‌డ్ రిజర్వ్డ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత అరెస్టు పోలీసు శాఖలో ఒక సంచలన వివాదంగా మారింది. ఆమె మీద పలు ఐపీఎస్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఏఆర్ హోంగార్డ్ ఎస్సైగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు స్వర్ణలతకు సంబంధించి ఆ కేసులకు మించిన మరో హాట్ టాపిక్ వెలుగులోకొచ్చింది. 

స్వర్ణలతకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టమని... ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండానే 'ఏపీ 31' అనే ఒక సినిమాలో నటిస్తోందని.. దీనికి సంబంధించిన పోస్టర్ వెలుగు చూడటంతో అసలు వ్యవహారం బయటికొచ్చింది. గతంలో హోంగార్డు నియామకాల్లో స్వర్ణలత అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె విజయవాడకు బదిలీ అయింది. అక్కడ కొంతకాలం పని చేసిన తర్వాత శ్రీకాకుళం ఏఆర్‌కు వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు వేరే చోట పనిచేసిన స్వర్ణలత.. వైసిపి నేతల సిఫార్సుతో విశాఖపట్నంలో పోస్టింగ్ తెప్పించుకున్నారనే టాక్ ఉంది.

మొదట సిటీ ట్రైనింగ్ సెంటర్లో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత హోంగార్డుల రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ)గా బాధ్యతలు చేపట్టిన స్వర్ణలతకు మొదటి నుండి సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉందట. ఈ క్రమంలోనే తాను చేస్తున్న ఉద్యోగం గురించి కూడా మరిచిపోయి... కొంత కాలం క్రితం ఓ పాటకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోను సినిమాటిక్ స్టైల్లో రికార్డ్ చేయించుకుంది. దీన్ని రీల్‌గా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానంతో చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. 

ఇక ఒక ప్రజా ప్రతినిధి తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని చెప్పడంతో కొరియోగ్రాఫర్‌ని కూడా పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్వర్ణలత డాన్స్‌కు సంబంధించిన అనేక వీడియోలు వెలుగు చూశాయి.

వైసీపీ నేతలతో స్వర్ణలత తన పరిచయాలు బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే గత జీవీఎంసీ ఎన్నికల్లో ఆమె బంధువైన ఓ మహిళ అభ్యర్థి తరఫున ప్రచారంలో కూడా పాల్గొని విధి నిర్వహణలో ప్రభుత్వ అధికారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏంటంటూ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇక తాజాగా నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత అరెస్ట్ అయిన తరువాత... ఆమె మీద కేసు పెట్టకుండా ఉండాలని ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజా ప్రతినిధి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేసు నమోదు కాకుండా అడ్డుకోలేని పక్షంలో.. కనీసం ఆమె మీద పెట్టిన కేసు తీవ్రతనైనా తగ్గించేలా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్నిబట్టి స్వర్ణలతకు రాజకీయంగా ఎంత మద్దతు ఉందో అర్థమవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో స్వర్ణలత టిడిపి నేతపై ప్రెస్ మీట్ పెట్టి మరీ విడుచుకుపడ్డారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై ప్రెస్ మీట్ పెట్టి మరీ పంచ్ డైలాగ్స్ విసిరారు. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారు అంటూ అయ్యన్నపాత్రుడిపై మండిపడ్డారు. ఇప్పుడు స్వర్ణలత నటిస్తున్న 'ఏపీ 31' సినిమాకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాల్లో, పర్యవేక్షణలోనూ ఆమె భాగస్వామి అయినట్టుగా సమాచారం. అందుకోసమే స్వర్ణలత నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వర్ణలతకు కొందరు రియాల్టర్లతోను పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి.. కమిషన్ తీసుకుని కొన్ని ఫ్లాట్లు కూడా ఆమె బుక్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. తనపై వస్తోన్న ఆరోపణలకు స్వర్ణలత ఈసారి ఏమని ప్రెస్ మీట్ పెడతారో.. ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.

Trending News