Google Trend 12 Feet King Cobra Video: పాములు అంటే అందరికీ భయమే.. కొంతమంది అయితే పామును చూడగానే అరుపులు కేకలు పెడుతూ పరుగో పరుగని పరుగులు పెడతారు. పాములు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలుసు. ముఖ్యంగా కింగ్ కోబ్రాలైతే అన్ని పాముల కంటే చాలా డేంజర్. ప్రస్తుతం పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలకు అడవులలో ఆహారాలు దొరకక జనావాసాల్లోకి సంచరిస్తున్నాయి. ఇలా సంచారం చేసిన పాములను పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్స్ తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ 14 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వీడియో వివరాల్లోకి వెళితే..ఒడిస్సాలోని భాద్రక్ అనే గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన గోడౌన్ లో 14 అడుగుల కింగ్ కోబ్రా ప్రవేశిస్తుంది. అయితే ఆ పాము గోడౌన్‌లోకి వెళ్లడం ముందుగానే గమనించిన స్థానికులు  స్నేక్ క్యాచర్ సమాచారం అందించగా.. వెంటనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. ఆ గోడౌన్‌లో ఉన్న పామును పట్టుకోవడానికి క్యాచర్ చాలా సేపు వెతికాడు అయినప్పటికీ ఆ భారీ కింగ్ కోబ్రా దొరకలేదు. చివరకు ఓ ప్లాస్టిక్ ట్రే కింద దాగి ఉండడం గమనించి..పామును పట్టుకునేందుకు దానిని పట్టుకునేందుకు  ట్రే బయటకు లాగుతాడు. ఆ ట్రేతో పాటు పాము కూడా బయటికి వస్తుంది. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


ఆ స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు 15 నిమిషాల పాటు ఎంతో ప్రయత్నిస్తాడు.. అయినప్పటికీ దొరికినట్లు దొరికి పక్కకు పారిపోవడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఇదే క్రమంలో ఆ స్నేక్ క్యాచర్‌ను కాటేసే ప్రయత్నం కూడా చేస్తుంది. దీనిని ముందుగానే గమనించిన స్నేక్ క్యాచ్ కింగ్ కోబ్రా కాటు నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు పట్టుకున్న పామును సైతం వదిలేస్తాడు. అయితే ఇదే క్రమంలో ఆ పాము స్పీడ్ గా పక్కకి పారిపోవడం మీరు చూడవచ్చు. పారిపోవడం గమనించిన స్నేక్ క్యాచర్ తోకను పట్టుకొని అమాంతం లాగుతాడు. ఇలా చివరకు ఆ పాము క్యాచర్‌కు దొరికిపోతుంది. 


ఈ వైరల్ అవుతున్న వీడియోను Mirzamdarif అని యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను 19 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోకు సంబంధించిన వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు. అయితే చాలామంది ఈ వీడియోని చూసి భయపడినట్లు కామెంట్లలో తెలిపారు. ఇలా పాములను రక్షించి ప్రకృతిని కాపాడుతున్న స్నేక్ క్యాచర్ కి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి