Snake Hanging On Cable wire: పాముని చూసి ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతుంటారు అది సర్వ సాధారణమే. పాడుబడ్డ ఇళ్లలో, చెట్లు, పొదల్లో అకస్మాత్తుగా కంటబడి భయానికి గురి చేస్తుంటాయి. కానీ ఇపుడు చూడబోయే వీడియో చూస్తే మీ గుండె ఆగిపోవటం ఖాయం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విషయానికి వస్తే.. ఈ సంఘటన ఫిలిప్పీన్స్‌ (Philippines) నగరంలో ఎల్లపుడు రద్దీగా ఉండే బోహోల్ మార్కెట్‌ వీధిలో జరిగింది. నిజానికి ఒక పెద్ద పాము నడి రోడ్డు పైన కాదండి బాబోయ్ ఏకంగా గాల్లో కేబుల్ వైర్ పై నుండి కిందకి జారిపడిపోయింది. అది కూడా రాత్రి సమయంలో కేబుల్ వైర్లపై అతి పెద్ద  పాము పాకుతూ కనిపించింది. 


Also Read: Vaccination Mistakes in Telangana: 2 నెలల కింద చనిపోయిన వ్యక్తికి ఈ నెల 12 న టీకా...


కేబుల్ వైర్లపై పాము పాకుతూ కనిపించటం.... అక్కడి ప్రజలు ఫోన్లో వీడియోలు తీయటంతో... ఆ ఏరియా అంత గందరగోళంగా మారిపోయింది. కాసేపు వైర్లపై పట్టుకొనే ఉన్న పాము ఒక్కసారిగా కింద పడిపోయింది. కింద పడగానే జనాలు మూకుమ్మడిగా పరిగెత్తారు. కానీ అక్కడ ఉన్న స్నేక్ స్నాచర్ పాముని పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టాడు. 



కానీ పాములు ఎక్కడ పడితే అక్కడ కనపడటం.... ఇలా జనాల్లోకి రావటం వింతగా ఉన్నా.. ప్రజలు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ అవగా... నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. 


Also Read: Surekha Vani Second Marriage News: నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా..?? వైరలైన ఫోటోలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook