Hundreds of snakes found in ntr district: చాలా మంది పాములు కన్పిస్తే భయంతో ఆ ప్రదేశం నుంచి దూరం పారిపోతుంటారు. పాములు ఉన్న చోట అస్సలు ఉండరు. పొరపాటున ఎక్కడైన పాములు కన్పిస్తే.. వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. అడవులు, చెట్లు, పొదలు ఉన్న చోట పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. పంట పొలాలు, ఎలుకలు ఎక్కువగా ఉన్న చోట పాములు సంచరిస్తుంటాయి.  కొంత మంది పాములు కన్పించగానే దాడులు కూడా చేస్తుంటారు. కొట్టి చంపుతుంటారు. కానీ పాములను మాత్రం.. చంపితే కాలసర్పదోషం వస్తుందని మరికొందరు భావిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలా ఉండగా.. పాములకు చెందిన అనేక  ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్ లు సైతం పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.  కొన్ని వీడియోలు చూస్తే భయకరంగాను, షాకింగ్ కు గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఒక ఇంట్లో వందల కొద్ది పాములు బైటపడ్డాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరువురులోని.. గంపలగూడెంలో ప్రాంతంలో ఒకే ఇంట్లో 100 కొద్ది పాములు బైటపడ్డాయి.  గంపలగూడెం మండల కేంద్రంలోని.. పడమట దళితవాడలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా.. కోట రజిని ఇంటి ఆవరణలో 100 వరకు పాములు కన్పించాయి.


ప్రహారికి గోడకు ఒక కన్నం పడింది. దీంతో ఆ కన్నం పూడ్చేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. గోడవద్దకు వెళ్లి.. కన్నంను పరిశీలించింది. ఇంతలో ఆమె నోటమాటరాలేదు. అక్కడ వందల కొద్ది పాములు బైటపడ్డాయి. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.


Read more: Viral Video: బాబోయ్.. సమోసాలో ‘కప్పకాలు’.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..


వెంటనే.. వీటిని గమనించిన ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులకు సమాచారం ఇవ్వగా అవి వాన పాములుగా గుర్తించారు. దీంతో  వాటిని తీసేసి.. బయటకు తీసి బయటికి పడవేశారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.