Tiger Bear Fight: "పొట్టొడ్ని పొడుగోడు తంతే.. పొడుగోడ్ని పోచమ్మ కొడుతుంది" అనే మాట మన పెద్దవాళ్లు చెబుతుంటారు. అలానే ఎంతటి బలవంతుడైన ఒక్కోసారి ఓడిపోక తప్పదు. ఇదే విషయం జంతువులకూ వర్తిస్తుంది. సాధారణంగా అడవిలో పులులు, సింహాలు రాజ్యమేలుతాయి. అంతటి బలమైన పులులు, సింహాలే కొన్ని సార్లు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పులి అనేక జంతువులపై దాడి చేయడం టీవీలోనూ ప్రత్యక్షంగానో చూసే ఉంటారు. కానీ, అందుకు భిన్నంగా ఓ ఎలుగు బంటి పులిని వేటాడింది. తనను చంపడానికి వచ్చిన పులిని వెంటాడి తోక ముడుచుకునేలా చేసింది ఎలుగుబంటి. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఏం జరిగిందంటే?


అడవిలో ఒంటరిగా ఓ ఎలుగుబంటి నడుచుకుంటూ వెళ్తుంది. దాన్ని గమనించిన పులి.. ఎలుగుపై దాడి చేసేందుకు తెగబడుతుంది. ఎలుగుబంటి తలను నోటితో పట్టుకొని కొద్దిసేపు పులి పట్టు బిగించినా.. ఎలుగు దాన్నిప్రతిఘటించింది. 


ఎదురు తిరగడం సహా పులిపై దాడికి తెగబడింది. అలా పులిలో భయాన్ని గొల్పించిన ఆ ఎలుగుబంటి దాదాపు చాలా దూరం వెంటాడుతూ వచ్చింది. అలా వెంటాడుతూ, వేటాడుతూ పులిని తరుముతూ వెళ్లింది. 


ఆ తర్వాత ఎలుగుబంటి దెబ్బకు బయపడిన ఆ పులి ఓ నీటి కుంటలో కూర్చుని దాని అలుపు తీర్చుకుంది. ట్విట్టర్ లో షేర్ అవుతున్న ఈ వీడియో ఇప్పటి వరకు 500 వ్యూస్ దక్కించుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి.  



Also Read: Jayasuriya Ex Girlfriend: భార్య సెక్స్ టేప్ లీక్ చేసిన మాజీ క్రికెటర్.. ప్రతీకారం తీర్చుకునేందుకే!


Also Read: Train Viral News: ఓ వైపు వేగంగా రైలు దూసుకొస్తోంది.. పట్టాలపై పడుకున్నాడు.. ఏం జరిగింది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి