Idly Ice Cream Video: ఐస్ క్రీమ్ అంటే మనలో చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాలైన (ఫ్లేవర్స్) ఐస్ క్రీమ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఐస్ క్రీమ్ కు సంబంధించిన  ఓ సరికొత్త టేస్ట్ సో,ల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని చూస్తే ఐస్ క్రీమ్ ను ఇష్టంగా తినే వాళ్లకు కచ్చితంగా కోపం వస్తుందనడంలో సందేహమే లేదు. ఆ వీడియో ఏంటో మీరూ చూసేయండి!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇడ్లీ - ఐస్ క్రీమ్ కాంబో..


ఢిల్లీలోని ఓ ప్రాంతంలో వింతైన ఫుడ్ కాంబినేషన్ ను తయారు చేస్తున్నారు. నగరంలోని కొంతమంది స్ట్రీట్ ఫుడ్ తయారీ దారులు ఇలాంటి వింతైన వంటకాలను తయారు చేస్తున్నారు. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇడ్లీ ఐస్ క్రీమ్ పేరుతో తయారు చేసిన ఓ వంటకం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. ఇంతకీ అందేంటో మీరూ చూసేయండి. 



ఢిల్లీకి చెందిన ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ఐస్‌క్రీమ్‌ లో ఇడ్లీ - సాంబార్ ను మిక్స్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దానిపై పలురకాల కామెంట్స్ వస్తున్నాయి. ఐస్ క్రీమ్ ప్రియులు ఈ కాంబినేషన్ పై మండిపడుతుండగా.. మరికొంతమంది టేస్ట్ ఎలా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియోను thegreatindianfoodie అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేశారు. ఈ వంటకానికి 'ఇడ్లీ ఐస్ క్రీమ్' గా పేరు పెట్టారు.  


Also Read: Shocking News: పగబట్టిన నాగుపాము.. ఒకే వ్యక్తిని 7 సార్లు కాటేసింది!


Also Read: Sea Monster Video: నీటి అడుగున భయంకరమైన జీవి- చూస్తే చెమటలు పట్టడం ఖాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook