Shocking News: పగబట్టిన నాగుపాము.. ఒకే వ్యక్తిని 7 సార్లు కాటేసింది!

Shocking News: పాము పగబట్టిందని మనం ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒకే పాము తనను ఏకంగా 7 సార్లు కాటేసిందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాని భయంతో ఇప్పుడు కూలి పనికి కూడా వెళ్లడం మానేసినట్లు చెప్పాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 06:36 PM IST
Shocking News: పగబట్టిన నాగుపాము.. ఒకే వ్యక్తిని 7 సార్లు కాటేసింది!

Shocking News: ఏదైనా పామును చంపబోతే ఆ పాము పగబట్టి కాటేస్తుందని అనేక సినిమాల్లో మనం చూసే ఉంటాం. కానీ, నిజ జీవితంలో ఓ వ్యక్తిపై పగ పెట్టుకున్న నాగు పాము.. అతడ్ని 7 సార్లు కాటు వేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో జరిగింది. అసలు పాము పగబట్టడం ఏంటి? అది కూడా 7 సార్లు కాటేయడం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. 

ఏం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాకు చెందిన థానా స్వర్ గ్రామంలో ఎహ్సాన్ అలీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అయితే అతడు గతంలో అనుకోకుండా ఓ పామును చంపాడు. ఆ పాముకు చెందిన మరో జంట పాము.. తనపై 7 సార్లు దాడి చేసి కాటేసిందని చెబుతున్నాడు. ఇలాంటి సంచలన వార్తతో ఎహ్సాన్ అలీ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. 

పాము కాటు వేసిన ప్రతిసారీ తన కుటుంబ సభ్యులు చికిత్స కోసం తనను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని ఎహ్సాన్ అలీ చెప్పాడు. పాము కాటువేసిన ప్రతిసారీ తాను మృత్యువు నుంచి తప్పించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సార్లు అదే పాము తనను కాటు వేసిందని గుర్తించాడు. ఈ క్రమంలో తాను పూర్తి భయాందోళనతో జీవితాన్ని గడుపుతున్నట్లు ఆ వ్యక్తి అంటున్నాడు. పాము భయంతో తాను కూలి పనికి వెళ్లడం కూడా మానేసినట్లు ఆవేదన వ్యక్తిం చేశాడు. 

Also Read: Sea Monster Video: నీటి అడుగున భయంకరమైన జీవి- చూస్తే చెమటలు పట్టడం ఖాయం!

Also Read: Suicide in Metro Station: మెట్రో స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడిన యువతి.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News