Best Courses After 12th: 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత విద్యార్థులు అందరికీ అత్యంత కష్టతరమైన సమయం. ఎందుకంటే ఆ సమయంలో ఏ రంగంలోకి వెళ్లాలి? అని నిర్ణయించుకోవాలి. అయితే ఏమి చేయాలనుకుంటున్నారు? అనే విషయం దాని నుండి మీరు ఎంత సంపాదించవచ్చు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇష్టం లేకుండా ఏ పనైనా చేస్తే ఎక్కువ కాలం అది చేయలేరు. అయితే ఇంటర్మీడియట్ తర్వాత లక్షల రూపాయల జీతం లేదా మీ వ్యాపారం చేసి లక్షలు సంపాదించే కొన్ని కోర్సుల గురించి మీకు తెలియజేస్తున్నాము.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిప్లొమా ఇన్ నర్సింగ్ లేదా ఫిజియోథెరపీ


మెడికల్ స్టడీస్ బాగా ఖరీదయినది, కానీ డాక్టర్ అయ్యాక సంపాదన కూడా బాగుంటుంది. అయితే అంత డబ్బు పెట్టలేని వారు కావాలంటే నర్సింగ్ లేదా ఫిజియోథెరపీలో డిప్లొమా చేయవచ్చు. అలా చేయడం వలన ప్రయోజనం ఏమిటంటే, అది చేసిన తర్వాత మీరు మీ స్వంత క్లినిక్‌ని తెరవవచ్చు, లేదా మీరు ఏదైనా ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ గా ఉద్యోగం చేయవచ్చు. లేదా మీరు క్లినిక్ నడుపుకుంటూనే హాస్పిటల్ లో కూడా పని చేయచ్చు. 


డిప్లొమా ఇన్ డిజైనింగ్


మీకు కొత్త వస్తువులు తయారు చేయాలని అనిపిస్తే, మీరు తయారు చేస్తున్న వాటిని ప్రజలు మెచ్చుకుంటున్నట్టు అయితే, మీరు ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్, వెబ్ డిజైనింగ్ సహా గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో కోర్సులు చేయవచ్చు. ఈ కోర్సులు చేసిన తర్వాత, మీరు ఫ్రీలాన్స్ వర్క్ కూడా చేయవచ్చు లేదా పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా చేయ వచ్చు. ఉద్యోగం లేదా ఫ్రీలాన్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించిన తర్వాత, మీరు మీ స్వంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. అందుకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, అంతేకాదు మీరు విదేశాలలో కూడా పనిచేయవచ్చు.


డిప్లొమా ఇన్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్


ఈమధ్య కాలంలో మన దేశంలో వివిధ భాషల అనువాదకుల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రయివేటు కంపెనీల్లోనే కాలేదు వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ఇలాంటి వారికి డిమాండ్ ఏర్పడింది. నిజానికి  లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ డిప్లొమా 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఇప్పుడు చైనీస్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలకు అనువాదకులకు అధిక డిమాండ్ ఉంది.
Also Read: Little krishna: ఈ ఫొటో ఎవరిదో గుర్తు పట్టారా? తెలుగోడు మీసం మెలేసేలా చేసిన డైరెక్టర్ ఈయన?


Also Read: Balagam Collections: బలగం 'బలం' ఇదీ.. ఓటీటీలో రిలీజయ్యాక కూడా థియేటర్లకు క్యూ కడుతున్న జనాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook