Scorpion Farming on Terrace : ఇంటి టెర్రస్‌పై తేళ్లలాంటి క్రాఫిష్ సాగు.. దున్నేస్తేన్న యువతి
Farming on Terrace video goes viral on social media: ఇంటిపై మనం అయితే పూల మొక్కలు లేదంటే కాయగూరల మొక్కలో సాగు చేస్తాం.. కానీ ఆమె మాత్రం ఏకంగా తేళ్లను సాగు చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
In Hairraising Video Chinese Girl Seen Doing Farming on Terrace video goes viral on social media: సాధారణంగా ఇంటిపై మనం అయితే పూల మొక్కలు లేదంటే కాయగూరల మొక్కలో సాగు చేస్తాం.. కానీ ఆమె మాత్రం ఏకంగా తేళ్లను సాగు చేస్తోందంటూ ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.. అవునండీ బాబు.. ఇది నిజం. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసే వాళ్లంతా వామ్మో.. ఇదేమీ సాగు అంటూ నోరెళ్లబెట్టుతున్నారు.
అంతేకాదు తేళ్లను సాగు చేసి వాటిని ఆమె రోజూ వాటిని ఫ్రై చేసుకొని తింటుండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన తేళ్లను లోకల్ ఫుడ్ రెస్టారెంట్లకు (Local food restaurants) అమ్ముకుంటూ ఉండొచ్చు అంటున్నారు.
అంతేకాదండోయ్.. మీరు ఇలా చేయబట్టే కదా కోవిడ్ వచ్చిందని చెప్పుకొస్తున్నారు.. అయినా కూడా మీరు మారరా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. (Netizens) మీరు ఇలాంటవన్నీ చేస్తే మళ్లీ కరోనా విరుచుకుపడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Also Read : HD Kumaraswamy: 'జన్ ధన్ ఖాతాలు హ్యాక్ చేసి రూ.6 వేల కోట్లు కొల్ల గొట్టారు'
నేచర్ లవర్స్ ఓకే (Naturelovers_ok) అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో యువతి వాటిని పెంచే ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. అయితే వీడియోలో కనిపిస్తున్న యువతి చైనా అమ్మాయి (China girl) అని ఎలాంటి ఆధారం లేదు. కానీ నెటిజెన్స్ మాత్రం ఆమె చైనా అమ్మాయిగానే భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు..ఇలా తేళ్లను పెంచేది.. వాటిని తినేది ప్రపంచంలో చైనాలో తప్ప ఇంకెక్కడ చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చైనా వాళ్లు తేళ్లు, కుక్కలు.. ఒక్కటా రెండా ఈ భూమిపై ఉండే ప్రతి జీవినీ లాగించేస్తారు అంటున్నారు. అందుకే కరోనా లాంటి కొత్త కొత్త వ్యాధులు (New diseases) పుట్టుకొస్తున్నాయంటున్నారు. మొత్తానికి ఇంటి టెర్రస్‌పై (Terrace of the house) ఈ తేళ్లలాంటి క్రాఫిష్ సాగు చేస్తున్న వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
కానీ... ఆ వీడియోలో ఉన్నవి తేళ్లు కావు...అవో రకమైన రొయ్య జాతికి చెందినవి.. క్రాఫిష్ (crawfish) అంటారు. చైనాలోనే కాదు... చాలా దేశాల్లో వీటిని వండుకొని తింటారు. ఇంటి డాబాపై వేల సంఖ్యలో వీటిని సాగుచేస్తోంది ఆ యువతి.. మన రైతులు కల్లాల్లో ధాన్యం రాశులు దున్నుతున్నట్లుగా వాటిని ఆ యువతి దున్నుతున్న ఈ వైరల్ వీడియో (Viral Video) అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
Also Read : Warner Six On Dead Ball: ‘వార్నర్ అలాంటి షాట్ ఆడడం సిగ్గుచేటు’.. గౌతమ్ గంభీర్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి