Warner Six On Dead Ball: ‘వార్నర్ అలాంటి షాట్ ఆడడం సిగ్గుచేటు’.. గౌతమ్ గంభీర్ ఫైర్

Warner Six On Dead Ball: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో బౌలర్ హఫీజ్ చేయి జారీ వచ్చిన బంతిని సిక్సర్ గా కొట్టడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. వార్నర్ ఇలా ఆడడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 03:37 PM IST
Warner Six On Dead Ball: ‘వార్నర్ అలాంటి షాట్ ఆడడం సిగ్గుచేటు’.. గౌతమ్ గంభీర్ ఫైర్

Warner Six On Dead Ball: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌కు గట్టి షాకిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది ఆస్ట్రేలియన్ టీమ్. ప్రత్యర్థి నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత తడబడిన కంగారూలు ఆ తర్వాత బలంగా పుంజుకుని పాక్‌కు తీరని వేదన మిగిల్చారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆడిన ఓ షాట్‌పై భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి క్రీడా స్ఫూర్తి అత్యంత దయనీయంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు.

ఆస్ట్రేలియా ఛేదనలో 8వ ఓవర్‌కు బంతి అందుకున్న పాక్‌ బౌలర్‌ మహ్మద్ హఫీజ్‌.. తొలి బంతి వేస్తుండగా తడబడ్డాడు. దీంతో బంతి కాస్తా అతడి చేయి నుంచి జారి రెండు సార్లు బౌన్స్‌ అయ్యింది. దీంతో వార్నర్‌ ఏ మాత్రం ఆగకుండా ముందుకొచ్చి మరీ ఆ బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌గా మలిచాడు. అయితే ఆ తర్వాత ఆ బాల్‌ను అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. క్రికెట్‌లో ఈ షాట్ అనూహ్యమే అయినప్పటికీ.. ఆ డెలివరీని డెడ్‌ బాల్‌గా చెప్పే నిబంధనేదీ లేదు.

అయితే ఇది కాస్తా గౌతమ్ గంభీర్ కు కోపం తెప్పించింది. మ్యాచ్‌ అనంతరం ఈ షాట్‌పై ట్విటర్‌ వేదికగా స్పందించిన గంభీర్‌.. “వార్నర్‌ క్రీడా స్ఫూర్తి ఎంత దయనీయంగా ఉంది..! సిగ్గుచేటు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, దీనిపై స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయాన్ని కూడా కోరాడు. గతంలో ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మన్కడింగ్‌ చేసిన అశ్విన్‌పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి అశ్విస్‌ స్పందిస్తూ.. “ఇప్పుడు ఇది కరెక్ట్‌ అయితే అప్పుడు అది కూడా సరైందే (మన్కడింగ్‌ను ఉద్దేశిస్తూ). ఒకవేళ అది తప్పయితే.. ఇది కూడా తప్పే” అని అన్నాడు. 

ఇదిలా ఉండగా.. పాక్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో నిలకడగా ఆడిన ఓపెనర్‌ వార్నర్‌.. అర్ధశతకాన్ని ఒక్క పరుగులో కోల్పోయాడు. షాబాద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే వార్నర్‌ ఔట్‌ అయిన విధానం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షాబాద్‌ వేసిన బంతిని వార్నర్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. కీపర్‌ ఆ బంతిని క్యాచ్‌ పట్టుకోవడంతో అంపైర్‌ ఔట్‌ అయినట్లు ప్రకటించారు. వార్నర్‌ కూడా బంతి బ్యాట్‌కు తగిలిందనుకుని పెవిలియన్‌ చేరాడు. అయితే ఆల్ట్రా ఎడ్జ్‌లో బంతి ఎక్కడా బ్యాట్‌కు తగలకపోవడం గమనార్హం. వార్నర్ ఔట్ అయిన విధానానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. 

Also Read: Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం

Also Read: Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News