ఒకరు భారత్‌లో, మరొకరు పాకిస్తాన్లో.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు! హృదయాలను పిండేసే దృశ్యం
India-Pakistan Brothers meets after 75 years. 80 ఏళ్ల ముహమ్మద్ సిద్ధిక్, 78 ఏళ్ల మొహమ్మద్ హబీబ్.. 74 ఏళ్ల క్రితం భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన విభజన సమయంలో విడిపోయారు.
Two Brothers Mohammad Siddique, Mohammad Habib meets after 75 years: మనిషి జీవితంలో తల్లి దండ్రుల అనంతరం ఎక్కువ అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఉండేది తోడపుట్టిన వారి మీదే. సోదరుడు లేదా సోదరీమణి కొంత కాలం దూరం ఉంటేనే మనం తట్టుకోలేం. వారిని ఎప్పుడు కలుస్తామా.. ఎప్పుడెప్పుడు మాట్లాడుతామా అని ఎదురుచూస్తుంటాం. అలాంటిది ఓ ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా 74 సంవత్సరాలు విడిపోయారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో సోదరులిద్దరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. విషయంలోకి వెళితే...
80 ఏళ్ల ముహమ్మద్ సిద్ధిక్, 78 ఏళ్ల మొహమ్మద్ హబీబ్ అన్నదమ్ములు. వీరిద్దరూ 74 ఏళ్ల క్రితం భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన విభజన సమయంలో విడిపోయారు. ఆనాటి కల్లోలంలో వీరి కుటుంబం జలంధర్ నుంచి పాకిస్తాన్ బయలుదేరింది. సోదరి, తల్లితో కలిసి హబీబ్ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో దేశ విభజన జరిగింది. సరిహద్దుల్లో అల్లకల్లోలం కారణంగా ప్రాణ భయంతో ఊరొదిలి వెళ్లిపోతున్నారు. అందరూ పాకిస్తాన్ వెళుతున్నారు. నాన్న, అక్కతో కలిసి సిద్ధిక్.. ఫైసలాబాద్‌లోని శరణార్థి శిబిరానికి చేరుకున్నాడు. అక్కడ సిద్ధిక్ అక్క జబ్బుపడి చనిపోగా.. చాలా రోజుల తర్వాత తండ్రి అక్కడికి వచ్చాడు.
కుటుంబం దూరం కావడంతో హబీబ్ తో ఉన్న అమ్మ చనిపోయింది. ఆమె పుట్టింటివాళ్లు కూడా పాకిస్తాన్ వెళ్లిపోయారు. సర్దార్ అనే స్నేహితుడితో హబీబ్ ఉండిపోయాడు. హబీబ్ అమ్మమ్మ వాళ్లు కూడా పాకిస్తాన్‌కు వచ్చేయటంతో ఇక సంబంధం లేకుండా పోయింది. మరోవైపు సిద్ధిక్ తన మేనమామల వద్ద పెరిగాడు. ఫైసలాబాద్‌లో కొంతకాలం ఉన్న తర్వాత చక్ 255లో వ్యవసాయం చేస్తూ పెళ్లిచేసుకున్నాడు. హబీబ్ మాత్రం పెళ్లిచేసుకోకుండా సర్దార్ కుటుంబంతోనే ఉన్నాడు.
సిద్ధిక్ తన తమ్ముడు బతికే ఉన్నాడని బలంగా నమ్మి.. తన మిత్రుడి కొడుకు మొహమ్మద్ ఇష్రాక్‌కు విషయం చెప్పాడు. నసీర్ ధిల్లాన్ అనే వ్యక్తి సాయంతో ఇష్రాక్.. ఓ వీడియో తీశాడు. కొన్ని రోజుల తర్వాత ధిల్లాన్, ఇష్రాక్ వచ్చి హబీబ్ ఆచూకీ తెలిసిందని చెప్పారు. అన్నదమ్ములను ఫోన్లో మాట్లాడించారు కూడా. హబీబ్ పాకిస్తాన్ రావాలనుకున్నాడు. అది సాధ్యం కాకపోతే సిద్ధిక్ ఇండియా వెళ్లాలని అనుకున్నాడు. కరోనా కారణంగా ఆలస్యం అయింది. కర్తార్‌పూర్ కారిడార్ తెరవడంతో 74 ఏళ్ల తర్వాత కలుసుకున్న సోదరులిద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఫూల్‌వాలాలో ఉంటున్న హబీబ్.. పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
Also Read: ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఊహించని షాక్.. భారతదేశాన్ని సస్పెండ్ చేసిన ఫిఫా! ఆతిథ్య హక్కులు పాయే
Also Read: India COVID 19 Update: భారీగా తగ్గిన కరోనా కేసులు.. దేశంలో కొత్తగా ఎన్నొచ్చాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.