FIFA Banned AIFF: ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఊహించని షాక్.. భారతదేశాన్ని సస్పెండ్‌ చేసిన ఫిఫా! ఆతిథ్య హక్కులు పాయే

FIFA Banned AIFF and Stripped U17 Women’s World Cup hosting rights. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) మంగళవారం ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 16, 2022, 11:01 AM IST
  • ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఊహించని షాక్
  • భారతదేశాన్ని సస్పెండ్‌ చేసిన ఫిఫా
  • ఏఐఎఫ్‌ఎఫ్‌ ఆతిథ్య హక్కులు
FIFA Banned AIFF: ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఊహించని షాక్.. భారతదేశాన్ని సస్పెండ్‌ చేసిన ఫిఫా! ఆతిథ్య హక్కులు పాయే

All India Football Federation Banned by FIFA: అఖిల భారత ఫుట్‌‍బాల్ సమాఖ్య (AIFF)కు ఊహించని షాక్‌ తగిలింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) మంగళవారం ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును కూడా తొలగించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల (థర్డ్‌ పార్టీ) ప్రమేయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫిఫా ఓ ప్రకటనలో పేర్కొంది. 85 ఏళ్ల చరిత్రలో ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించడం ఇదే తొలిసారి.

ఫిఫా చట్టాలను థర్డ్‌ పార్టీ తరచుగా ఉల్లఘించినందుకు ఏఐఎఫ్‌ఎఫ్‌పై చర్యలు తీసుకున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య వివరించింది. ఈ విషయంపై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఈ నిర్ణయంతో ముగ్గురు సభ్యుల ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయని తెలిపింది. ఏఐఎఫ్ఎఫ్‌పై పాలక మండలి తిరిగి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఫిఫా చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది అక్టోబర్‌లో 11 నుంచి 30 మధ్య భారత్‌ వేదికగా అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ జరగాల్సి ఉండే. ఫిఫా తాజా నిర్ణయంతో  ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును కూడా భారత్ కోల్పోయింది. టోర్నీకి సంబంధించి తదుపరి చర్యల కోసం ఫిఫా బ్యూరో ఆఫ్‌ కౌన్సిల్‌కు రిఫర్‌ చేస్తామని హెచ్చరించింది. భవిష్యత్తులో ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ అధికారాలను చేపట్టేందుకు.. అడ్మిన్‌స్ట్రేటర్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకొన్నాకే ఈ సస్పెన్షన్‌ ఎత్తివేస్తామని ఫిఫా స్పష్టం చేసింది. సానుకూల ఫలితాలు వెలువడవచ్చనే ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా 50 లక్షలు విరాళం!

Also Read: పవన్ కళ్యాణ్ సినిమా లేనట్టే.. వింత ట్వీట్ తో కొత్త అనుమానాలు రేపిన బండ్ల!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News