ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు ( Surgical Strike ) చేయడంలో మాత్రమే కాదు.. మానవత్వాన్ని చూపడంలో కూడా ముందుంటుంది. ఈ విషయాన్ని నిరూపించే ఒక ఘటన ఇటీవలే జరిగింది. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ ( Viral Video ) అవుతోంది. ఇండియన్ ఆర్మీ మంచితనం, తెగువను ప్రజలు ప్రశంసిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!


ఈ వీడియోలో ఒక ఉగ్రవాది సైన్యం ముందులొంగిపోవడం చూడవచ్చు. అతని వయసు సుమారు 20 సంవత్సరాలు ఉంటుంది. అతని ముఖం నిండా చావు భయం కనిపిస్తుంది. కానీ భారత సైన్యం అతని పరిస్థితిని అర్థం చేసుకుని లొంగిపోయే అవకాశం కల్పించింది.అదే సమయంలో అతను వదిలివేసిన ఆయుధాన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.


లొంగిపోయే అవకాశం
ఈ యువకుడు కొన్ని రోజుల క్రితమే మిలిటెంట్ గ్రూపులో చేరాడు అని సమాచారం. కొంత మంది ఉగ్రవాదులో ఒక పొదలో దాక్కున్నారు అని తెలిసుకున్న సేన్యం వెంటనే రంగంలోకి దిగింది. కొన్ని రౌండ్స్ కాల్పులు కూడా జరిగాయి. అయితే అమాయకులైన యువకులను ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని.. వారు తప్పుదారి పట్టారు అని అర్థం చేసుకున్న ఆర్మీ ఆఫీసర్.. యువకుడిని లొంగిపోయే అవకాశం కల్పించాడు. 



ALSO Read  | Aadhaar PVC Card: పర్సులో పట్టే హైటెక్ ఆధార్ కార్డు


నీకేం కాదు.. బయటికి రా...
ఆర్మీ ( Indian Army) నుంచి కొన్ని మీటర్ల దూరంలో పొదల్లో చేతిలో ఆయుధంతో ఉన్న యువకుడిని చుట్టుముట్టింది. తరువాత ఏం జరుగుతుందో అర్థం కాలేదు అతనికి. కాల్పులు జరిపితే మరణం తథ్యం అనుకున్నాడు. చావు కళ్ల ముందు ఉంది అనుకున్నాడు. అంతలోనే ఒక ఆర్మీ ఆఫీసర్ ...కాల్పులు జరపకండి.. నీకేం కాదు..బయటికి రా. ఎవరూ ఏం చేయకండి. నీ బట్టలు వేసుకో. నీ ఆయుధాలు అక్కడే వదిలేయ్...ఇక్కడికి రా... అని అన్నాడు. అది విన్న తరువాత మిలిటెంట్ తన తప్పును సరిదిద్దుకునే ఒక అవకాశం లభించింది అనుకున్నాడు. అంతే ఆర్మీ అధికారి చెప్పినట్టు చేసి లొంగి పోయాడు.



ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీని ప్రపంచం ఎందుకు కీర్తిస్తుందో మన చూడవచ్చు. యువకుడు పూర్తిగా ఆర్మీ అధికారి పరిధిలోకి రాగానే..ఇతనికి నీళ్లు ఇవ్వండి. నీ వల్ల తప్పు జరిగింది. కానీ మళ్లీ ఇదే తప్పు ఎప్పుడూ చేయకు అని చెప్పాడు అధికారి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR