Angry King Cobra Viral Video : పాములంటే చాలా దూరం భయంతో పరిగెత్తే వారు ఉంటారు. కానీ స్నేక్ క్యాచర్స్ పాములను రక్షించేందుకు ప్రాణాలు సైతం పణంగా పెట్టి పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతమంది స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకునే క్రమంలో కాటు కూడా గురవుతున్నారు. అయినప్పటికీ పాములు పట్టుకుని వృత్తిని వదలడం లేదు. కొంతమంది పాములు పట్టుకునే వారు పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలను సాహసం చేసి పట్టుకునే క్రమంలో కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఓ స్నేక్ క్యాచర్ ఎంతో సాహసం చేసి రెండు ఇండియన్ కింగ్ కోబ్రాలను పట్టుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోలో ఏం జరిగిందంటే..?
మామూలుగా పాములు గడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దూరుతూ ఉంటాయి. అయితే మీరు ఈ వీడియో చూసినట్లయితే.. పశువుల కొట్టంలో మేతగా వేసి గడ్డిలో రెండు పాములు దూరాయి. దీంతో యజమాని ఓ స్నేక్ క్యాచర్ ను సంప్రదిస్తాడు. ఇంతలోనే పాములు పట్టేవాడు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ ప్రదేశంలోని పాములు ఉండే ప్రాంతాన్ని గమనించి వాటిని వెతికే ఎందుకు ప్రయత్నిస్తాడు. ఇదే క్రమంలో ఓ కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ దృష్టిలో పడుతుంది. దీంతో ఆయన స్నేక్ క్యాచింగ్ స్టిక్ తో పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన పట్టుకుని క్రమంలో  బయటికి వెళ్లిపోయేందుకు పాము వివిధ ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ స్నేక్ క్యాచర్ ఆ పామును వదలడు. అయితే నెమ్మదిగా ఆ పాముని పట్టుకొని సంచిలో వేస్తాడు.



ఇండియన్ బిగ్ కింగ్ కోబ్రా..
ఆ క్యాచర్ ఒక పాముని పట్టుకొని సంచిలో బంధించిన సంగతి మీరు వీడియోలో చూసి ఉంటారు. అయితే ఇప్పుడే అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడూ చూడని ఇండియన్ బిగ్ కింగ్ కోబ్రా ను మీరు ఇప్పుడు చూడవచ్చు. అదే పశువులకు మేతగా వేసే గడ్డి కిందే ఇంకో బిగ్ కింగ్ కోబ్రా దాగి ఉంటుంది. దీనిని గమనించిన స్నేచర్ క్యాచర్ దానిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయినప్పటికీ నలుపు రంగులో ఉన్న ఆ భయంకరమైన కింగ్ కోబ్రా అతనికి చిక్కదు దొరకదు. ఆ క్యాచర్ కోబ్రాను ఎలాగైనా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు అయినప్పటికీ ఆ పాము దొరకదు. ఈ క్రమంలో స్నేక్ క్యాచర్ ను కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆయనకు పాము కాటుల నుంచి బయటపడేందుకు ఎక్స్పీరియన్స్ ఉండడంతో కాటేసి క్రమంలో పక్కకు తప్పుకుంటాడు. ఇలా దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ పాము స్నేక్ క్యాచర్ చేతికి చిక్కుతుంది. దీంతో ఆయన ఆ రెండు పాములను బంధించి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తాడు.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook