Indian Railways Worst trains: తరచుగా రైలు ప్రయాణాలు చేసే వారికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య ఇది. ఎక్స్ ప్రెస్ రైల్లో టికెట్ దొరక్కపోవడంతో ప్యాసింజర్ రైలు ఎక్కి కూర్చుని.. ఆగుతూ ఆగుతూ పోతూ ఉంటే నరకం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అదే ఎండా కాలం అయితే ఆ ప్రత్యక్ష నరకం ఇంకా మామూలుగా ఉండదు. కొన్నిసార్లు పేరుకే ఎక్స్‌ప్రెస్ రైలు అయినప్పటికీ.. ప్యాసింజర్ ట్రెయిన్ తరహాలో అన్ని రైల్వే స్టేషన్లలో ఆగుతూ ఆగుతూ వెళ్లే రైళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మేము ఇండియన్ రైల్వేలో అలాంటి రైలు గురించే మీకు చెప్పబోతున్నాం. ఈ రైలు గురించి వింటే.. పొరపాటున కూడా ఆ రైలు ఎక్కకూడదురా బాబోయ్ అనే ఫీలింగ్ రావడం పక్కా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

111 స్టేషన్లలో ఆగే రైలు ఇది
ఈ రైలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మొత్తం 111 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది అంటే నమ్ముతారా ? నమ్మితీరాల్సిందే. ఇది హౌరా - అమృత్‌సర్ మెయిల్. పేరుకే ఇది ఎక్స్‌ప్రెస్ రైలు. కానీ రైలు ప్రయాణం మొత్తం ఆగుతూ ఆగుతూ వెళ్తుంటే రైలు ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి


ఈ రైలు ఏ మార్గంలో నడుస్తుందంటే..
పశ్చిమ బెంగాల్‌లోని హౌర్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ వరకు. ఈ ఎక్స్ ప్రెస్ రైలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, యూపి, హర్యానా మీదుగా పంజాబ్ చేరుకుంటుంది. ఈ రైలు హౌరా నుండి అమృత్‌సర్ వరకు దాదాపు 2005 కి.మీల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 37 గంటల సమయం పడుతుంది.


ఇది కూడా చదవండి : Zomato Delivery Boy Eating Food: ఆకలి బాధకు దృశ్యరూపం.. గుండెలు పిండేసే వీడియో


ట్రెయిన్ టికెట్ ఛార్జీ ఎంతంట   ?
ఈ ట్రెయిన్ టికెట్ ధరల గురించి చెప్పాలంటే, స్లీపర్ క్లాస్ ధర రూ.735. గా ఉంది.  థర్డ్ ఏసీకి రూ.1950, సెకండ్ ఏసీకి రూ.2835 గా ఉంది. ఇదే కాకుండా ఫస్ట్ క్లాస్ ఏసీకి రూ.4835 టికెట్ ధరలు ఉన్నాయి. ఈ రైలులో ప్రయాణం ఒక రకంగా చెప్పాలంటే ఈ రైలులో ప్రయాణం రైలు ప్రయాణికులకు అగ్ని పరీక్ష లాంటిదే. ఎందుకంటే దారి పొడవునా 111 రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతూ వెళ్తుంటే ఎవరికైనా ఓపిక నశించి కోపం కట్టలు తెంచుకోవడం ఖాయం. కానీ తామే టికెట్ బుక్ చేసుకుని మరీ రైలు ఎక్కారు కనుక ఎవ్వరినీ ఏమీ అనడానికి ఉండదు. గమ్యస్థానం చేరే వరకు ఓపిక పట్టడం తప్పించి ఇక చేసేదేం ఉండదు. అందుకే సర్వసాధారణమైనంత వరకు ఇలాంటి రైళ్లలో ప్రయాణం చేయకపోవడమే ఉత్తమం.


ఇది కూడా చదవండి : Big King Cobra Viral Video: వీడబ్బా.. ఏంట్రా ఆ ధైర్యం.. కింగ్ కోబ్రా కాటేయటానికి వస్తే .. కాస్త కూడా భయం లేకుండా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK