Most Searching On Smartphones: చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారో తెలుసా ?
Indians Most searching Things On Smartphones: స్మార్ట్‌ఫోన్స్ యూజర్స్ తమ ఫోన్స్‌ని ఏయే అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా, స్మార్ట్‌ఫోన్‌లో ఏయే అంశాల కోసం వెతుకుతున్నారో తెలుసా ? ఇదే విషయమై వివో ఇండియా జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Indians Most searching Things On Smartphones: ఈ దేశం, ఆ దేశం అని లేకుండా అన్ని దేశాల్లోనూ ఇప్పుడు మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగమై పోయింది. అందుకు ఇండియా ఏం మినహాయింపు కాదు. ఆమాటకొస్తే.. ఎన్నో ప్రపంచ దేశాల కంటే ఇండియాలోనే స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువగా ఉన్నట్టు గతంలోనే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ వినియోగం అంటే.. కమ్యునికేషన్ నుంచి ఆన్‌లైన్ పేమెంట్స్ వరకు ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆన్‌లైన్ బ్రౌజింగ్ అందులో ఒకటి. అలా స్మార్ట్‌ఫోన్‌లో చాలామంది ఎక్కువగా ఏం వెతకడానికి, ఏం చేయడానికి ఉపయోగిస్తున్నారో తెలుసా ? .
స్మార్ట్‌ఫోన్స్ యూజర్స్ తమ ఫోన్స్‌ని ఏయే అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా, స్మార్ట్‌ఫోన్‌లో ఏయే అంశాల కోసం వెతుకుతున్నారో తెలుసా ? ఇదే విషయమై వివో ఇండియా జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
స్మార్ట్‌ఫోన్‌ని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే..
వివో ఇండియా ఒక నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్ ని చాలామంది యుటిలిటీ బిల్స్ పేమెంట్స్ కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తేలింది. దాదాపు 86 % మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ తమ స్మార్ట్‌ఫోన్స్ ద్వారా ఉపయోగించి యుటిలిటీ బిల్స్ చెల్లిస్తున్నారు.
షాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారు
ఒక నివేదిక ప్రకారం, సుమారు 80.8% మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం తమ స్మార్ట్‌ఫోన్స్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే, 61.8% మంది ప్రజలు అవసరమైన వస్తు సామాగ్రిని కొనగోలు చేయడానికి స్మార్ట్‌ఫోన్స్‌ని ఉపయోగిస్తున్నారు అని పరిశోధనలో తేలింది. 66.2% మంది వినియోగదారులు ఆన్‌లైన్ సేవల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.
అంతేకాకుండా, 73.2% మంది వినియోగదారులు ఇంట్లోకి అవసరమైన నిత్యవసర కిరాణా సామాన్లను కొనుగోలు చేయడానికి స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. మరో 58.3% మంది ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Popcorn Bill = Amazon Prime Cost: థియేటర్లో పాప్‌కార్న్‌కి అయ్యే ఖర్చుతో ఇంట్లోనే కూర్చుని ఏడాది మొత్తం సినిమాలు చూడొచ్చు
స్త్రీలు, పురుషులు.. వీళ్లలో ఫోన్‌ని ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుసా ?
స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులలో స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి గురించి మాట్లాడుతూ, ఒక అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 62% మంది పురుషులు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తుండగా.. మరో 38% మంది మహిళలు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. అదే సమయంలో పెద్ద, చిన్న నగరాల గురించి మాట్లాడుకున్నట్లయితే, స్మార్ట్‌ఫోన్ వినియోగంలో మెట్రో నగరాలు 58% వినియోగంతో అగ్ర స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత, 41% వినియోగంతో నాన్-మెట్రో నగరాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Too Many Snakes in Open Well: బావి నిండి భయంకరమైన నాగుపాములు, రక్త పింజర్లు.. ఎంత తెలివిగా పట్టాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK