Instagram Dispute: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ చుట్టూ వివాదం పెరుగుతోంది. యుక్తవయస్సు అమ్మాయిలపై ఇన్‌స్టాగ్రామ్ చెడు ప్రభావం చూపిస్తోందంటూ వస్తున్న వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాలకు ఆధారాలున్నాయని తెలుస్తోంది. అదే నిజమైతే ఫేస్‌బుక్ చిక్కుల్లో పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచంలో అగ్రస్థానం ఫేస్‌బుక్‌దే(Facebook). ఈ సంస్థ ఆధ్వర్యంలోనే మరింత ప్రాచుర్యం పొందిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. గత కొద్దికాలంగా ఇన్‌స్టాగ్రామ్‌పై వివాదం రేగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ టీనేజి అమ్మాయిలపై చెడు ప్రభావం చూపిస్తోందంటూ అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ నియంత్రణ లేకపోవడంతో కొందరు యుక్త వయస్సు అమ్మాయిలు ఆత్మహత్యదిశగా ఆలోచిస్తున్నారనేందుకు పక్కా ఆధారాలున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. వాల్‌స్ట్రీట్(Wall Street Journal) కథనాలపై చర్చ సాగుతుండగానే..మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఫేస్‌బుక్ సంస్థలో ఫేక్‌న్యూస్ నిరోధించే విభాగంలో పనిచేస్తున్న ఫ్రాన్సెస్ హోగెన్ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోందని..ఫేస్‌‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తప్పుడు సమాచారం, సమాజంపై చెడు ప్రభావానికి సంబంధిచిన వివరాల్ని తానే మీడియాకు ఇచ్చినట్టు కూడా చెప్పారు. పొరపాట్లను సరిదిద్దుకోకుండా మరిన్ని తప్పులు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఫలితంగా ఇన్‌స్టాగ్రామ్ చుట్టూ వివాదం మరింతగా బిగుసుకుంది. 


అయితే ఫేస్‌బుక్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌పై(Instagram) వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తోంది. వినియోగదారుల రక్షణకై అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నామని అంటోంది. ఇన్‌స్టాగ్రామ్ వల్ల టీనేజర్లపై ఎలాంటి చెడు ప్రభావం లేదని..ఇంకా మేలు చేస్తుదంని తెలిపింది. మరోవైపు ఫేస్‌బుక్‌పై మీడియాకు సమాచారమిచ్చిన ఫ్లానెస్స్ హౌగెన్ అనే మహిళ..ప్రొటెక్టిక్ కిడ్స్ ఆన్‌లైన్ పేరుతో సమగ్ర నివేదిక రూపొందించారు. రేపు తన నివేదికను సెనెట్ (Senate)సభ్యులకు అందించనున్నారు. ఈ నివేదికలో పక్కా ఆధారాలుంటే ఫేస్‌బుక్ సంస్థ చిక్కుల్లోపడటం ఖాయం. ఇన్‌స్టాగ్రామ్ భవిష్యత్ ప్రశ్నార్ధకం కానుంది.


Also read: Electric Vehicles Charging: ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి