COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jail Food Viral News: మనలో చాలా మంది ఫుడ్‌ అంటే ఇష్టంలో  వెరైటీ ఆహార పదార్థాలను టై చేస్తూ ఉంటారు. దీని కోసం కొత్త కొత్త రెస్టారెంట్‌లు, హోటల్స్‌ తిరుగుతూ ఉంటారు. ఇలా తిరుగుతూ తినడం చాలా కామన్‌..మీరు ఎప్పుడైన జైలు రెస్టారెంట్‌ కాకుండా రియల్‌ జైలులో ఫుడ్‌ ట్రై చేశారా? చాలా మందికి మనసులో ఎన్నో ప్రత్నాలు తలెత్తవచ్చు. జైలులో ఫుడ్‌ ఏంటీ, ఎక్కడ దోరుకుతుందని..అయితే మీకు ఈ రోజు పక్క జైలులో ఖైదీలు తీనే ఫుడ్‌ను పరిచయం చేయబోతున్నాం.   


సాధరణంగా చాలా మంది బైట ఉండే రెస్టారెంట్స్‌లో లభించే ఫుండ్స్‌ తింటూ ఉంటారు. అయితే ఫుడ్‌ రివ్యూస్‌ చేసేవారు కొత్తగా ట్రై చేస్తు ఉంటారు. ఇలాంటి వారికోసం మేము జైలు ఫుడ్‌ పరిచయం చేయబోతున్నాం.  జైలులోశిక్ష అనుభవించేవారు తినే ఫుడ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే ఈ ఫుడ్‌ తప్పకుండా ట్రై చేయాల్సి ఉంటుంది. కాన్పూర్ మేజిస్ట్రేట్ కొత్త ఆలోచన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. జైలులో ఉండే ఖైదీలతో రుచికరమైన ఆహారాలు తయారు చేసి క్యాంటిన్‌లో బయటవారికి విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  


ఇలా ఖైదీలు తయారు చేసిన ఆహారాలు చాలా తక్కవ ధరలకే విక్రయించేందుకు అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా జైలర్లను చూసేందుకు వచ్చే కుటుంబ సభ్యులకు ఉంచితంగా ఈ ఆహారాలను అందించబోతునట్లు కూడా సమాచారం. కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ చోరవతో అతి త్వరలోనే ఓ ఫుడ్‌ కౌంటర్‌ను కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జైలులో అందరు ఖైదీలకు సరిపడ ఆహారాలను జైలులో ఉండే ఖైదీలే వండుతున్నారని జిల్లా జైలు సూపరింటెండెంట్ డాక్టర్ బి.పి.పాండే పేర్కొన్నారు. అంతేకాకుండా ఆసక్తి గల ఖైదీలకు త్వరలో వంట కూడా నేర్పబోతున్నట్లు కూడా తెలిపారు.


త్వరలో అధికారులు జైలు గేటు బయట ఫుడ్‌ కౌంటర్‌ను కూడా చేపించబోతున్నారని సమాచారం. ఇదే సంవత్సరంలో ఆగస్టు నుంచి జైట్‌ ఫుడ్‌ అందరికీ లభించేలా సన్నాహాలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఫుడ్స్‌ ఐటమ్స్‌ కానీ, వాటీ ధరలకు సంబంధించిన వివరాలు ఇంకా వివరించలేదు. త్వరలోనే వీటిని సంబంధించి సమాచారాన్ని కూడా అందిస్తామని ఆధికారులు తెలిపారు. సీటీలో వివిధ ప్రాంతాల్లో నివసించేవారు ఆన్ లైన్ లో ఆర్డర్‌ చేసేకునే విధంగా అన్ని రకాల సౌకర్యలతో ఈ క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డాక్టర్ బి.పి.పాండే పేర్కొన్నారు.


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి