Journalist brave Fighting With Leopard in Rajasthan: సాధారణంగా అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాలలో తరచుగా క్రూర జంతువులు వస్తుంటాయి. మనం ఏనుగులు, చిరుతపులులు, ఎలుగు బంట్లు గ్రామాల మీద దాడులు చేయడం చూస్తుంటాం. ముఖ్యంగా ఏనుగులు గుంపులుగా వచ్చి పంటపోలాలను నాశనం చేస్తాయి. పొరపాటున వాటికళ్లలో పడితే... ఇంకా బతకనివ్వదు. అలాగే చిరుతపులులు ముఖ్యంగా రాత్రిపూట గ్రామాల్లోకి వస్తుంటాయి. అవి ముఖ్యంగా కుక్కలు, చిన్న పిల్లలు, పొలాల్లో ఉండే వాళ్ల మీద దాడులు చేస్తుంటాయి. చిరుతపులులు చెట్లమీద ఎక్కి, దూరం నుంచి తమ వేటలను చూస్తాయి. ఆ తర్వాత అవి దాడులకు పాల్పడుతాయి. మిగతా క్రూర జంతువులు కూడా ఇళ్లలోనికి ప్రవేశించిన ఎన్నోఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొన్నిసార్లు ఇలాంటి సమయంలో మనుషులు చాకచక్యంగా వ్యవహరిస్తే, జంతువులకు వేటగా కాకుండా బతికిపోవచ్చు. కానీ కొందరు మాత్రం.. ఇలాంటి జంతువులు  వస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తారు. ఫారెస్ట్ అధికారులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని, జంతువులను వలలతో బంధించి ప్రత్యేకంగా బోనులో వేసుకుని తిరిగి అడవిలో వదిలేస్తుంటారు. ఇలాంటి ఎన్నో వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. తమ పిల్లల కోసం చిరుతపులి, పులులతో కూడా తల్లులు పోరాడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఒక జర్నలిస్ట్ చిరుతతో ఫైటింగ్ చేశాడు. ఇప్పుడిది వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


రాజస్థాన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దుంగార్‌పుర్‌ గ్రామంలోకి ఒక చిరుత ప్రవేశించింది. వెంటనే గ్రామస్థులంతా మూకుమ్మడిగా దాన్ని ఎలాగైన బంధించాలని ప్లాన్ చేశారు. కర్రలు, వలలతో అక్కడికి వెళ్లారు. ఈ ఘటనను కవర్ చేయడానికి ఒక జర్నలిస్ట్ కూడా వెళ్లాడు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్  ఘటన జరిగింది. చిరుతపులి ఒక్కసారిగా అమాంతం జర్నలిస్టు గున్వంత్ కలాల్ పై దాడిచేసింది. దీంతో అతను చాకచక్యంగా వ్యవహరించి,చిరుతతో ఫైటింగ్ కు దిగాడు.


Read More: Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..


అంతే కాకుండా చిరుతను తన రెండు చేతులతో గట్టిగా కదలకుండా అదిమిపట్టుకుని,దానిమీద ఎక్కికూర్చున్నాడు. అప్పుడు వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని తాడుల సహాయంతో చిరుతను బంధించారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని బోనులో చిరును బంధించడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను బంధించంలో చాకచక్యంగా వ్యహరించిన జర్నలిస్టును ఫారెస్ట్ అధికారులు అభినందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook