Japan school girls dance to katrina kaifs kala chashma song: బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్ జంటగా నటించిన చిత్రం 'బార్ బార్ దేకో'. 2016లో విడుదల అయిన ఈ సినిమాలోని పాట 'కాలా చష్మా' చాలా ఫేమస్ అయింది. ఈ పాటలో కత్రీనా అదిరే స్టెప్పులతో అదరగొట్టారు. కాలా చష్మా సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఎక్కడ పార్టీ జరిగినా, పెళ్లి జరిగినా కాలా చష్మా పాట మోగుతోంది. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది. నిత్యం ఈ పాటపై డాన్సులు చేస్తున్నారు. తాజాగా జపాన్ అమ్మాయిలు అద్భుతంగా స్టెప్పులు వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నార్వేకు చెందిన డాన్స్ గ్రూప్ ‘ది క్విక్ స్టైల్’ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జపాన్‌కు చెందిన 10 మందికి పైగా స్కూల్ పిల్లలు కాలా చష్మా పాటకు అదిరే స్టెప్పులు వేశారు. అమ్మాయిలు అందరూ పెప్పీ ట్రాక్‌కు ట్రెండీ మూమెంట్స్ ఇచ్చారు. ఈ వీడియో గంటలోపే 2.3 మిలియన్ పైగా వ్యూస్ సంపాదించింది. ఈ  వీడియో చూసిన అందరూ అమ్మాయిల స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. క్యా డాన్స్ హై మామ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 



'బార్ బార్ దేకో' సినిమాలోని కాలా చష్మా పాటకు ఉగాండాకు చెందిన ఓ డజను మందికి పైగా పిల్లలు అదిరే స్టెప్పులు వేశారు. ఆ డ్యాన్స్‌కు తెలంగాణ ఐ‌టి శాఖల మంత్రి కేటీఆర్‌ కూడా ఫిదా అయిపోయారు. ఆ మధ్యన ఈ సాంగ్‌ని కొందరు అమెరికన్స్ పెళ్లి ఫంక్షన్‌‌లో ఫెర్మార్స్ చేసి ఒక్క సారిగా హైప్ తీసుకొచ్చారు. మన దేశంలో అయితే రోజుకో వీడియో, రీల్ వస్తున్నాయి. 


Also Read: IND vs SA: ఆఖరి ఓవర్‌లో నా గేమ్‌ ప్లాన్ అదే..సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!  


Also Read: Minister KTR: రాబోయే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్..మా స్కెచ్ అదేనన్న మంత్రి కేటీఆర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook