Minister KTR: గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను చూపి అధికారంలోకి వచ్చి ఏం సాధించారని ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటిని నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. తమను గెలిపిస్తే దేశానికి తెలంగాణ మోడల్ చూపిస్తామని స్పష్టం చేశారు.
2024 పార్లమెంట్ ఎన్నికలే తమ టార్గెట్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)గా మార్చామన్నారు. ఇందుకు పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. తమకు చుట్టు పక్కల రాష్ట్రాల్లో మద్దతు ఉందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి పంజాబ్‌కు విస్తరించిందని..అలాగే తాము కూడా పుంజుకుంటామన్నారు.
అధికారం కోసమో..పదవుల కోసమో సీఎం కేసీఆర్..జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదని తెలిపారు. దేశంలో ఉన్న పరిస్థితులను మార్చేందుకు నేషనల్ పాలిటిక్స్‌లో వెళ్తున్నారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. మోదీ అండ్ కో వ్యూహాలన్నీ తమకు తెలుసని..వాటిని ధీటుగా ఎదుర్కొంటామన్నారు. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తాము చెప్పడం లేదని..క్రమేపి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.
ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై సెటైర్లు వేశారు. ఆయన భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ చేపట్టాలన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత ఉందని..ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమయ్యిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఆయన ఎన్నిరోజులైనా యాత్ర చేసుకోవచ్చు అని అన్నారు. రాష్ట్రంలో అస్తిత్వం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. దేశంలో ఆ పార్టీ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.
డబ్బుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దీనిపై తనకు పక్క సమాచారం ఉందన్నారు. ఉప ఎన్నిక కాంట్రాక్టర్ బలుపునకు, ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరు అని అన్నారు. మునుగోడులో తమదే విజయమని స్పష్టం చేశారు.
Also read:Munugode Bypoll: మునుగోడులో రెడ్డి వర్సెస్ రెడ్డి..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..!
Also read:IND vs SA: ఆఖరి ఓవర్‌లో నా గేమ్ ప్లాన్ అదే..సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook