Viral News: లాక్‌డౌన్‌లో భార్యను కలుసుకునేందుకు Bus చోరీ చేసిన ఘనుడు, పోలీసులు షాక్
Man Steals Private Bus Amid Lockdown | తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించారని ప్రయాణానికి వీలుకాదని భావించిన ఓ వ్యక్తి ఏకంగా బస్సునే చోరీ చేశాడు. ఆపై సినిమాలో ట్విస్టును మించిన కథలు చెప్పాడు. నాలుగు జిల్లాల పోలీసులను సైతం తన మాటలతో బురిడీ కొట్టించాడు.
Kerala Man Steals Private Bus | కరోనా వైరస్ కట్టడి చర్యలలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ విధించారు. అయితే తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించారని ప్రయాణానికి వీలుకాదని భావించిన ఓ వ్యక్తి ఏకంగా బస్సునే చోరీ చేశాడు. ఆపై సినిమాలో ట్విస్టును మించిన కథలు చెప్పాడు. నాలుగు జిల్లాల పోలీసులను సైతం తన మాటలతో బురిడీ కొట్టించాడు. కేరళలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కేరళకు చెందిన దినూప్ అనే 30 ఏళ్ల యువకుడు శనివారం నాడు కోజికోడ్ బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును చోరీ చేశాడు. లాక్‌డౌన్‌లో వలస కూలీలను వారి స్థలాలకు తీసుకెళ్లేందుకు తాను వెళ్తున్నానని చెప్పడంతో డ్రైవర్ మాటలు పోలీసులు నమ్మేశారు. నాలుగు జిల్లాల పోలీసులు దినూప్ మాట నమ్మి బస్సును అనుమతించారు. మళప్పురం, త్రిసూర్, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల గుండా ప్రయాణించిన బస్సును చివరగా కుమరోకోం పోలీసులు అడ్డగించి తనిఖీ చేశారు.
Also Read: Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే
నిందితుడు దినూప్ చెప్పిన విషయాలు వారికి నమ్మశక్యంగా అనిపించలేదు. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించారని తన భార్యను కలుసుకునేందుకు ఇదే మార్గమని భావించినట్లు కుమరోకోం పోలీసులకు చెప్పాడు. బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా దాని యజమానికి ఫోన్ చేసి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. బస్టాండ్ సమీపంలో పార్కు చేసిన తమ బస్సు చోరీ అయిందని ఓనర్ చెప్పడంతో దినూప్ చెప్పింది కట్టుకథ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గతంలోనూ అతడిపై ఇలాంటివి రెండు కేసులు నమోదు కాగా, ప్రస్తుతం మరో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: Income Tax Benefits: ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, అయితే ఈ స్కీమ్‌లో చేరండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook