Three kids in car boot, Hyderabad Traffic Police issue challan: కొందరు వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా రాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారు. మరికొందరు బేసిక్ ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే కేర్‌లెస్ డ్రైవింగ్ చేస్తున్నారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికపుడు చలాన్‌లు జారీ చేస్తున్నారు. అయినా కూడా వాహనదారుల తీరు మారడం లేదు. తాజాగా కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసినందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'TS7HA8607' అనే నంబర్ ప్లేట్ గల కారు జాతీయ రహదారిలో వెళుతోంది. ఆ కారు డిక్కీలో ముగ్గురు పిల్లలు (ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి) ఉన్నారు. ముగ్గురు కూడా కూడా కారు డిక్కీలో కూర్చుని ఓ బొమ్మతో ఆడుకుంటున్నారు. కారు లోపల ఉన్న పేరెంట్స్ మాత్రం వారిని పట్టించుకొవడం లేదు. ఈ ఘటనను వెనకాల వెళుతున్న కారులోని వారు వీడియో తీశారు. నంబర్ ప్లేట్ కనబడేలా జూమ్ చేసి మరీ వీడియో తీశారు. 



ఆ వీడియోనూయి సోమవారం 'సోంచో జరా' అనే ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ చేశాడు. 'వారు బాధ్యత లేని తల్లిదండ్రులు?.  దయచేసి ఈ వీడియో చూసి చర్యలు తీసుకోండి' అని @KTRTRS, @TelanganaCOPs, @HiHyderabad, @tsrtcmdoffice పేర్లను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేట్‌ను ఆధారంగా చలాన్ జారీ చేశారు. 'సర్ మీ ఫిర్యాదు మేరకు సదరు వాహనదారుడికి ఇ-చలాన్ పంపాము. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు' అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. 


Also Read: Gold Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత ధర పెరిగిందంటే..


Also Read: Horoscope Today September 7th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారి కెరీర్‌లో ఇవాళ కీలక పరిణామం..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook