Horoscope Today September 7th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారి కెరీర్‌లో ఇవాళ కీలక పరిణామం..

Horoscope Today September 7th 2022: ఇవాళ బుధవారం. బుధవారానికి అధిపతి బుధ గ్రహం. హిందూ శాస్త్రాల ప్రకారం ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేయబడిన రోజు. మరి ఈ బుధవారం ఆ దైవ అనుగ్రహం, గ్రహాల అనుగ్రహం ఏయే రాశులపై ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...   

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 7, 2022, 06:42 AM IST
  • ఇవాళ బుధవారం.. కృష్ణ పరమాత్ముడికి అంకితం చేయబడిన రోజు
  • బుధవారానికి అధిపతి బుధ గ్రహం
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today September 7th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారి కెరీర్‌లో ఇవాళ కీలక పరిణామం..

Horoscope Today September 7th 2022: ఇవాళ బుధవారం. బుధవారానికి అధిపతి బుధ గ్రహం. హిందూ శాస్త్రాల ప్రకారం ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేయబడిన రోజు. మరి ఈ బుధవారం ఆ దైవ అనుగ్రహం, గ్రహాల అనుగ్రహం ఏయే రాశులపై ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

మేష రాశి (Aries) : కెరీర్‌ను గాడినపెట్టే ప్రయత్నాల్లో ఉంటారు. కొన్నాళ్లుగా పురోగతి లేని కెరీర్‌లో ఇవాళ ఒక్కసారిగా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. మీరు చేయాలనుకున్న పనులు పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబం లేదా స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి (Taurus)

ఆఫీసులో మీకు ఎదురయ్యే సవాళ్లు, ఆటంకాల గురించి ఓపెన్‌గా మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. ఆఫీసులో ఏవైనా రాజకీయాలు నడుస్తున్నట్లయితే.. ఆ కారణంగా మీరు నష్టపోతున్నట్లయితే.. ధైర్యంగా బయటకు చెప్పగలగాలి. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. మీ ప్రత్యర్థులు, శత్రువులు ప్రస్తుతానికి మీ జోలికి రారు.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీలోని క్రియేటివిటీకి మరింత పదును పెడుతారు. వ్యాపారస్తులు కొద్దిరోజులుగా బిజినెస్‌పై మరింత ఫోకస్ చేస్తారు. ఉద్యోగస్తులు తాము చేపట్టే ప్రాజెక్టులో కొత్త ప్రయోగాలు చేపడుతారు. ఫలితాలు కూడా పాజిటివ్‌గా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు కనిపించదు.

కర్కాటక రాశి (Cancer) 

తీరిక లేకుండా గడుస్తున్న రోజుల మధ్య ఇవాళ కాస్త ఉపశమనంగా ఫీలవుతారు. నిత్యం పని వెంట పరుగులు పెడుతూ అలసిపోతున్న మీకు ఇవాళ కాస్త విరామం దొరుకుతుంది. చంద్ర అనుగ్రహంతో ఆరోగ్యం, ఆర్థిక స్థితి బాగుంటుంది. ఇల్లు లేదా వాహనం లేదా ఇతర లగ్జరీ వస్తువుల కొనుగోలుకు రుణానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

సింహ రాశి (LEO)

పని భారం కారణంగా కొన్నాళ్లుగా ఒకరకమైన ఒత్తిడి, కన్ఫ్యూజన్ వెంటాడుతుంది. కానీ ఇవాళ్టితో ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. పని భారం లేదా ఇతరత్రా సమస్యలు తొలగిపోతాయి. వచ్చిన అవకాశాలను మరో ఆలోచన లేకుండా సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమికులకు అనుకూల సమయం.

కన్య రాశి (Virgo)

ఇవాళ మీకు నిరాశజనకంగా గడుస్తుంది. రోజంతా తెలియని అసంతృప్తిలో ఉండిపోతారు. ఇతరుల ఆగ్రహానికి అనవసరంగా మీరు బలయ్యే ప్రమాదం ఉంది. అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారస్తుల ఏకాగ్రత దెబ్బతినవచ్చు.  అయితే మధ్యాహ్నం వరకు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు మధ్యాహ్నం తర్వాత అనుకూల సమయం.

తులా రాశి (Libra)

ఆర్థిక స్థితిపై ఒకసారి విశ్లేషణ చేసుకోవడం అవసరం. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అనవసర ఖర్చులు, వృథా మానుకోవాలి. డబ్బుకు సంబంధించిన గందరగోళ పరిస్థితి ఏదీ ఎదురవకుండా చూసుకోవాలి. తోబుట్టువులతో ప్రాపర్టీ వివాదాలకు సంబంధించి ఇరువురి మధ్య ఇవాళ చర్చలు జరగవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio)

చంద్ర అనుగ్రహం ఉంటుంది. అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. వ్యాపారస్తులకు మాట తీరు కలిసొస్తుంది. మీ మాట కారణంగానే కొన్ని ఆర్డర్స్ పొందుతారు. అనుకోని బిగ్ డీల్ ఒకటి ఓకె అవడం మీకు అన్నివిధాలా కలిసొస్తుంది. కొన్ని కఠిన నిర్ణయాల్లో ఆచీ తూచీ వ్యవహరించాలి. వీలైతే జీవితభాగస్వామితో చర్చించాలి.

ధనుస్సు రాశి (Sagittarius)  

చంద్ర అనుగ్రహంతో అంతా అనుకున్నట్లుగా సాగుతుంది. ఆఫీసులో మునుపటికన్నా బాగా రాణిస్తారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టు చేపట్టే పనిలో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరుకుతుంది. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చించి మనస్పర్థలు తెచ్చుకోవద్దు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. 

మకర రాశి (Capricorn) 

ఇవాళ నిరాశే ఎదురవుతుంది. కాస్త కోపాన్ని తగ్గించుకుంటే పరిస్థితుల్లో మార్పు ఉంటుంది. లేనిపక్షంలో మరిన్ని బాధలు, నష్టాలు చుట్టుముడుతాయి. ప్రేమికులు పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లయితే జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆర్థిక స్థితి మునుపటికన్నా మెరుగ్గానే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. 

కుంభ రాశి (Aquarius)

మీ కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. అయితే మీరు కోరుకున్న కెరీర్ ఇదేనా కాదా అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ వెంటాడుతుంది. ధ్యానం లేదా ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. బ్యాచిలర్స్‌కి మంచి పెళ్లి సంబంధం రావొచ్చు. విద్యార్థులకు మంచి కర్మ మంచి ఫలితాలనిస్తుంది.

మీన రాశి (Pisces) 

ఇవాళ మీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. నష్టాలు ప్రాఫిట్స్‌గా మారుతాయి. సీనియర్ల సలహాలు, సూచనలు పనికొస్తాయి. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఇవాళ శుభ దినం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావొచ్చు. ప్రస్తుతానికి మీ శత్రువులు లేదా ప్రత్యర్థులు మీ వైపు కన్నెత్తి చూడరు.ప్రేమికులు పెళ్లికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవచ్చు. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Kottu Satyanarayana: ఏపీలోని ఆలయాల్లో ఇకపై డిజిటల్ దర్శనాలు: మంత్రి కొట్టు సత్యనారాయణ..!

Also Read:  రాత్రంతా సీలింగ్ ఫ్యాన్‌నే చూశా.. అర్ష్‌దీప్ సింగ్‌ మిసింగ్ క్యాచ్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x