Young Boy caught and playing with 10 feet King Cobra: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, చింపాజీ, కోతి, ఏనుగు, కుక్క, పిల్లి మరియు పాములకు సంబందించిన వీడియోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. నెట్టింట వైరల్ అయ్యే వీడియోలలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం అస్సలు నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెట్టింట వైరల్ అవుతున్న వీడీయోలో ఓ బాలుడు దాదాపు 10 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాతో సరదాగా ఆడుకుంటున్నాడు. వీడియో ప్రకారం.. భారీ కింగ్ కోబ్రా ఇంటి ఆవరణలోకి వస్తుంది. దాన్ని చూడగానే ఆ ఇంట్లోని పిల్లలంతా పరుగులు తీస్తారు. ఓ యువకుడు మాత్రం కింగ్ కోబ్రాకు భయపడకుండా దాన్ని పట్టుకునేందుకు ముందుకు వస్తాడు. కింగ్ కోబ్రా పడగ విప్పి బుసలు కొడుతున్నా కూడా ఆ యువకుడు అస్సలు వెనకడుగు వేయడు. యువకుడు నేలపై పడుకుని పామును పట్టుకుంటాడు. 


కింగ్ కోబ్రాను పట్టుకున్న ఆ యువకుడు.. దాన్ని తన ముఖానికి దగ్గరగా పెట్టుకుని చూస్తాడు. అంతేకాదు తల అటూఇటూ తిప్పుతూ.. కింగ్ కోబ్రాను సరదాగా వెక్కిరిస్తాడు. పడగ విప్పి ఉన్న ఆ పాము మాత్రం అతన్ని ఏమీ అనదు. యువకుడు పామును పట్టుకోగానే దూరంగా నిలబడి ఉన్న ఇద్దరు పిల్లలు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెలా సాధ్యం అని ముక్కున వేలేసుకుంటున్నారు. 



కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోను earth.reel అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతొంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అది కింగ్ కోబ్రా అనుకున్నావా.. లేక జీబ్రా అనుకున్నావా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కింగ్ కోబ్రాతో అలా ఆడుకుంటున్నావేందిరా బాబు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 


Also Read: Saniya Iyappan Video: అక్కడ చేయి వేశాడని.. ఆకతాయి చెంప పగలగొట్టిన హీరోయిన్ (వీడియో)!


Also Read: IND vs SA Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టీమిండియాకు దూరమైన కీలక ప్లేయర్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook