Saniya Iyappan Video: అక్కడ చేయి వేశాడని.. ఆకతాయి చెంప పగలగొట్టిన హీరోయిన్ (వీడియో)!

Malayalam actresses Saniya Iyappan touched in public. ప్రముఖ మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్‌కు చేదు అనుభవం ఎదురైంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 28, 2022, 02:12 PM IST
  • అక్కడ చేయి వేశాడని
  • ఆకతాయి చెంప పగలగొట్టిన హీరోయిన్
  • ప్రైవేట్ పార్ట్స్‌ను తాకేందుకు
Saniya Iyappan Video: అక్కడ చేయి వేశాడని.. ఆకతాయి చెంప పగలగొట్టిన హీరోయిన్ (వీడియో)!

Malayalam actresses Saniya Iyappan touched in public: ప్రముఖ మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్‌ (Saniya Iyappan)కు చేదు అనుభవం ఎదురైంది. సానియా నటించిన 'సాటర్‌డే నైట్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను తాకేందుకు ఓ ఆకతాయి ప్రయత్నించాడు. దాంతో చిర్రెత్తిపోయిన సానియా అతడి చెంప పగలగొట్టారు. ఈ ఘటన కోజికోడ్‌లోని హిలైట్ మాల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. 

మలయాళ హీరో నివీన్ పౌలీ.. హీరోయిన్స్ సానియా అయ్యప్పన్‌, గ్రేస్ ఆంటోనీలు నటించిన తాజా సినిమా 'సాటర్‌డే నైట్' (Saturday Night). ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నివీన్ పౌలీ, సానియా అయ్యప్పన్, గ్రేస్ ఆంటోనీలు కేరళలో కోజికోడ్‌లోని హిలైట్ మాల్‌కు వెళ్లారు. హీరో, హీరోయిన్స్ రావడంతో వారిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇక కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో జనాలు భారీగా గుమిగూడటంతో హీరో, హీరోయిన్స్ బయటికి వెళ్లేందుకు కష్టంగా మారింది. ఇదే అదనుగా ఓ ఆకతాయి సానియా ప్రైవేట్ పార్ట్స్‌ను తాకేందుకు ప్రయత్నించాడు. సానియాకు చిర్రెత్తుకొచ్చి అందరిముందే అతడి చెంప చెళ్లుమనిపించారు.

తాను లైంగిక దాడిని ఎదుర్కొన్నానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సానియా అయ్యప్పన్‌ ఓ  పోస్ట్ పెట్టారు. 'సాటర్‌డే నైట్ సినిమా ప్రచార కార్యక్రమాలను కోజీకోడ్‌లో ప్రమోట్ చేస్తున్నాము. ప్రమోషన్ కార్యక్రమాలు కోజీకోడ్‌లోని అన్ని ప్రదేశాలలో బాగా జరిగాయి. అందుకు కోజీకోడ్‌ ప్రజలకు కృతజ్ఞతలు. అయితే కోజీకోడ్‌లోని హిలైట్ మాల్‌లో ప్రచార కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా.. గుంపులో నుంచి ఓ వ్యక్తి నన్ను పట్టుకున్నాడు. మనచుట్టూ ఉన్నవారు ఎందుకు ఇలా ఉన్నారు?. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా సహచర నటికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నాపై అలా జరగడంతో ఒక్క క్షణం మౌనంగా ఉండలేకపోయాను. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఎదుర్కోకోకూడదని కోరుకుంటున్నా' అని సానియా అన్నారు. 

తనపై లైంగిక దాడి చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని సానియా అయ్యప్పన్‌.. కోజీకోడ్‌ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించామని, వారి ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. గ్రేస్ ఆంటోనీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపారు. ఇలా జరగడం అక్కడ ఇదే మొదటిసారి కాదు. నెల రోజుల క్రితం ఇదే మాల్‌లో జనాలు భారీ ఎత్తువ గుమిగూడటంతో పరిస్థితి అదుపు తప్పింది.

Also Read: IND vs SA Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టీమిండియాకు దూరమైన కీలక ప్లేయర్లు!

Also Read: నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. బోరున ఏడ్చేసిన మహేశ్‌ బాబు కుమార్తె సితార!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News