Google Trend King Cobra Video: వంట పాత్రలో భారీ నాగుపాము..చివరికి ఏమైందంటే మీరే చూడండి..
Google Trend King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగుపాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఓ నాగుపాము కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
Google Trend King Cobra Video : పాములను చూడగానే ఆమడ దూరం పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. సామాన్యంగా ఎవరికైనా పెద్దపెద్ద పాములను చూస్తే కాళ్లు, చేతులు వణుకుతాయి. ముఖ్యంగా బ్లాక్ కింగ్ కోబ్రాలు అంటే స్నేక్ క్యాచర్లు సైతం భయపడుతూ ఉంటారు. అయితే ఇటీవలే అడవి ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి వస్తున్న పాములను స్నేక్ క్యాచర్స్ పట్టుకొని జనాల నుంచి రక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే వనపర్తి జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీలో అతి భయంకరమైన నాగుపాము హాస్టల్ కిచెన్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో బాయ్స్ మెడికల్ కళాశాలలో ఉన్న కిచెన్‌లో ఓ భారీ నాగుపాము దూరింది. అయితే దీనిని గమనించిన హాస్టల్ వార్డెన్ స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. ఇంతలోనే ఆ పాము సంచారం చేసిన ప్రదేశానికి స్నేక్ క్యాచర్ చేరుకున్నాడు. ఆ కిచెన్ లో ఉన్న వంట పాత్రల్లో ఆ పాము దాగి ఉంటుంది. అయితే దీనిని గమనించిన స్నేక్ క్యాచర్ ఆ వంట పాత్రలన్నింటినీ కిచెన్ గదిలో నుంచి బయటకు తీసుకొస్తాడు.. ఇంతలోనే ఆ పాము ఒక్కసారిగా బయటికి వస్తుంది. అయితే ఆ పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ పలుసార్లు ప్రయత్నం చేయగా.. బుసలు కొడుతూ మీదికి వస్తుంది.
Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్ కేవలం రూ.12,499కే..ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు..
ఇలా స్నేక్ క్యాచర్ 15 నిమిషాల పాటు పామును పట్టుకుని ఎందుకు ప్రయత్నిస్తాడు అయినప్పటికీ ఆ పాము అతనికి చిక్కలేక పోతుంది. చివరికి పాము అలసిపోవడం గమనించి మరోసారి పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ స్నేక్ క్యాచర్‌కి పాము చిక్కుతుంది. ఆ పాముని పట్టుకొని సురక్షితమైన ప్రదేశానికి తరలిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 13వేల మందికిపైగా వీక్షించగా..నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి