Child King Cobra Viral Video: ఆడుకుంటున్న పిల్లాడి వద్దకు వచ్చిన భారీ కింగ్ కోబ్రా.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే వణికిపోతారు
Viral Video, Big Black King Cobra came near to Child, See wahat happen next. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఓ పిల్లాడు సరదాగా ఆడుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Black King Cobra in Child hands, See what happen next: ఈ భూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. మనిషి కింగ్ కోబ్రా కాటుకు గురైతే బతకడం చాలాచాలా కష్టం. కింగ్ కోబ్రా విషం అత్యంత విషపూరితమైనది కాకున్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ విషం చిమ్ముతుంది. అందుకే బలమైన ఏనుగు కూడా కింగ్ కోబ్రా కాటుకు నిమిషాల్లో చనిపోతుంది. అలంటి కింగ్ కోబ్రాతో ఓ పిల్లాడు సరదాగా ఆడుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ ఇంటి ప్రాంగణంలో ఒక చిన్న పిల్లవాడు సరదాగా ఆడుకుంటుంటాడు. ఓ భారీ కింగ్ కోబ్రా నెమ్మదిగా పాక్కుంటూ పిల్లాడి వైపు వస్తుంటుంది. అది చూసిన ఆ పిల్లాడు చేతులు ఊపుతూ ఆడుకుంటుంటాడు. నెమ్మదిగా కింగ్ కోబ్రా పిల్లాడి వద్దకు వస్తుంది. దాంతో పిల్లాడి ఒక్కరిగా దాన్ని పట్టుకుంటాడు. కింగ్ కోబ్రా పిల్లవాడి నోటి దగ్గరికి వెళ్లి వెనక్కి తగ్గుతుంది. ఆపై పక్కకు వెళ్లిపోతుంది. అప్పుడు పిల్లాడు ఏడవడం మొదలెడతాడు.
మొత్తం వీడియోలో కింగ్ కోబ్రాకు భయపడినట్టు చిన్నారి ఎక్కడా కనిపించలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని 'rajibul9078' ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 6 లక్ష్యలకు పైగా మంది వీక్షించారు. చాలా మంది రీట్వీట్ చేశారు.
Also Read: టవల్‌తో మెట్రో ఎక్కిన యువకుడు.. పడిపడి నవ్వుకున్న అమ్మాయిలు! టవల్ లాగితే పరిస్థితి ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.