Metro Towel Viral Video: బనియన్, టవల్‌తో మెట్రో ఎక్కిన యువకుడు.. పడిపడి నవ్వుకున్న అమ్మాయిలు!

Viral Video, Young Man halchal in Delhi Metro with towel. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ యువకుడు అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. బనియన్, టవల్‌ మాత్రమే ధరించి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 10, 2022, 01:34 PM IST
  • బనియన్, టవల్‌తో మెట్రో ఎక్కిన యువకుడు
  • పడిపడి నవ్వుకున్న అమ్మాయిలు
  • టవల్ లాగితే వీడి పరిస్థితి ఏంటి
Metro Towel Viral Video: బనియన్, టవల్‌తో మెట్రో ఎక్కిన యువకుడు.. పడిపడి నవ్వుకున్న అమ్మాయిలు!

Young Man boarded a Delhi Metro Train with a towel: సోషల్ మీడియా వచ్చినప్పటినుంచి యువతీ, యువకులు రెచ్చిపోతున్నారు. నెట్టింట ఫేమస్ అయ్యేందుకు కొందరు ఏవేవో పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైల్‌లో ఓ యువతి డ్యాన్స్‌ చేసి హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా మెట్రో రైలులో డ్యాన్స్ చేసిన ఆ అమ్మాయిపై మెట్రో యాజమాన్యం చర్యలు తీసుకుంది. తాజాగా అదే తరహాలో ఓ ఘటన ఢిల్లీ మెట్రోలో జరిగింది. 

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ యువకుడు అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. బనియన్, టవల్‌ మాత్రమే ధరించి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కాడు. దాంతో అక్కడున్న వారు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. యువకుడు విచిత్ర వేషధారణలో మెట్రో ఎక్కడమే కాకుండా అందులోని కంపార్ట్‌మెంట్లలో అటూఇటూ తిరిగాడు. అక్కడితో ఆగకుండా మెట్రో అద్దంలో చూసుకుంటూ తలదువ్వుకుంటూ ఫోజులిచ్చాడు. మెట్రో ప్రయాణిస్తున్న యువతులు ఈ యువకుడిని చూసి పడిపడి నవ్వుకున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar)

ఇందుకు సంబంధించిన వీడియోను మోహిత్ గౌహర్ (Mohit Gauhar) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. 'ఇంట్లోని ట్యాంక్‌లో నీరు అయిపోయాయి. ఈరోజు నేను ఆఫీసులో స్నానం చేస్తాను' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 'వీడి పిచ్చి త‌గ‌ల‌య్య‌' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మెట్రోలో ట‌వ‌ల్‌తో ఎక్కడం ఏంట్రా నాయనా' అని మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం ఉండాలి, టవల్ లాగితే వీడి పరిస్థితి ఏంటి అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Shani Dev: శని దేవునికి ఇష్టమైన ఈ దేవతలను పూజిస్తే ఆర్థికంగా బలపడడం ఖాయం..

Also Read: Health Insurance: తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలను చెక్ చేయండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

 

Trending News