King Cobra: హైదరాబాద్ రోడ్లపై తాచుపాము హల్‌చల్.. భారీగా ట్రాఫిక్ జామ్
King Cobra Found At Hyderabad Liberty Signal Causes To Traffic Jam: రద్దీగా ఉన్న రహదారిపైకి అకస్మాత్తుగా తాచుపాము ప్రత్యక్షమైంది. భయాందోళనతో వాహనదారులంతా తమ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
King Cobra On Hyderabad Roads: రోడ్లపై వేలకొద్దీ వాహనాలు పరుగులు పెడుతుండగా అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. అంతే వాహనాలన్నీ ఆగిపోయాయి. వాహనదారులంతా సెల్‌ఫోన్లు పట్టుకుని ఫొటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యంత రద్దీగా ఉండే రహదారిలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో వాహనాలు బారులు తీరాయి. చివరకు ఆ పాము విద్యుత్ స్తంభం పైకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే హిమాయత్‌నగర్ లిబర్టీ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం తాచుపాము కలకలం రేపింది. లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టుపై అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. ఇది చూసిన వాహనదారులు భయాందోళన చెందారు. తమపై పడుతుందనే ఆందోళనతో వాహనాలు ఆపి నిలిచిపోయారు. అనంతరం తమ సెల్‌ఫోన్లు తీసి వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ కనిపించారు.
Also Read: Mandi Biryani: పెళ్లి రోజు చావుకొచ్చింది.. మండీ బిర్యానీ తిన్న కుటుంబం ఆస్పత్రిపాలు
చెట్టుపై నుంచి పాము కేబుల్ వైర్ల సహాయంతో ట్రాఫిక్ సిగ్నల్ స్తంభంపైకి చేరుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలుసుకునేందుకు కూడా పాదచారులు, వాహనదారులు బారులు తీరారు. ఈ కారణంగా లిబర్టీ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వాహనాలు నిలవకుండా వెంటవెంటనే ముందుకు పోనిచ్చారు. వాహనదారులు నిలబడకుండా చర్యలు తీసుకోవడంగా కొన్ని నిమిషాల తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది. అయితే సిగ్నల్‌లో పాము ప్రత్యక్షమైన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter