Viral Incident: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం భర్త హల్‌చల్‌.. అర్ధరాత్రి పోలీసులకు ముప్పుతిప్పలు

Husband Climbs Atop Unipole Hoarding For His Wife: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి వెళ్లిందని ఓ భర్త హోర్డింగ్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 7, 2024, 03:24 PM IST
Viral Incident: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం భర్త హల్‌చల్‌.. అర్ధరాత్రి పోలీసులకు ముప్పుతిప్పలు

Viral News: కొన్నేళ్లు కలిసి ప్రేమించుకున్న అనంతరం పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు భార్య అతడిని వదిలేసి వెళ్లింది. ఎంతకీ తన వద్దకు రాకపోవడంతో ఆ భర్త ఆందోళనకు గురయ్యాడు. దీంతో దిక్కుతోచక హోర్డింగ్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. తన భార్యను తీసుకొస్తేనే కిందకు దిగుతానని చెప్పి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో చోటుచేసుకుంది.

Also Read: Water Supply Cut: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ సమీపంలోని యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి చంద్రశేఖర్‌ అనే వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తాను కీర్తి అనే యువతిని ప్రేమించానని.. కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్నట్లు చంద్రశేఖర్‌ వాపోయాడు. తిరుపతిలో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు తనతో కలిసి కాపురం చేసిందని చెప్పాడు. కొన్ని రోజులు ఆమె తల్లిదండ్రులు వచ్చి పుట్టింటికి తీసుకెళ్లారని తెలిపాడు. అప్పటి నుంచి తన వద్దకు పంపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్‌ పే నంబర్‌ అంటూ పిచ్చి రాతలు

 

తన భార్యను అప్పగిస్తే కానీ కిందకు దిగానని హోర్డింగ్‌పై చంద్రశేఖర్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన అత్తామామలపై కంచరపాలెం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అతడు చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు తనను నమ్మించి తీసుకెళ్లి మోసం చేశారని.. వెంటనే తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాడు. భార్యను అప్పగిస్తే కానీ హోర్డింగ్ నుంచి కిందకు దిగనని మొడికేసుకుని కూర్చున్నాడు. 

స్థానికులు, వాహనదారులు అతడిని వారించారు. ఎవరు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు ఫోన్‌ చేశారు. పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టాడు. చాలాసేపు తర్వాత చంద్రశేఖర్‌ను పోలీసులు బుజ్జగించారు. అతడి భార్యతో మాట్లాడి ఇద్దరినీ కలిపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం చంద్రశేఖర్‌ కిందకు దిగాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News