Crows Attacks Dangerous King Cobra on Road: సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఎక్కువగా 'కింగ్ కోబ్రా'కు సంబందించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. స్నేక్ క్యాచర్-కింగ్ కోబ్రా, ముంగిస-కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోలు జనాలకు బాగా నచ్చుతున్నాయి. తాజాగా అంతకుమించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ మట్టి రోడ్డుపై ఉన్న కింగ్ కోబ్రాను కొన్ని కాకులు రౌండప్ చేశాయి. రౌండప్ చేయడమే కాకూండా ఆ పాముని ఓ ఆటాడుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో (Cobra Crow Viral Video) ప్రకారం.. ఓ మట్టి రోడ్డును కింగ్ కోబ్రా దాటుతుంటుంది. ఆ సమయంలో 7-8 కాకుల గుంపు దాన్ని చూస్తాయి. కింగ్ కోబ్రా దాటుతుండగా.. కాకులు అన్ని దాన్ని రౌండప్ చేస్తాయి. దాంతో బయపడిపోయిన కింగ్ కోబ్రా పడగ విప్పి వాటిపై దాడి చేస్తుంది. కాకులు పైకి లేస్తూ సునాయాసంగా తప్పించుకుంటాయి. ఒకదాని తర్వాత మరొకటి కింగ్ కోబ్రాపై దాడి చేస్తాయి. దాంతో పాము హడలిపోతుంది. అయినా కూడా కాకులపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. 



Also Read: other Buffalo Fights with Lions: అప్పుడే పుట్టిన దూడ.. చుట్టూ సింహాల గుంపు.. తల్లి గేదె ఒంటరి పోరాటం.. గెలుపెవరిది..?


కాకుల గుంపు పదే పదే కింగ్ కోబ్రాపై దాడి చేయడంతో దానికి రక్తం కారుతుంది. చివరకు పాము నిస్సాయక స్థితిలోకి వెళుతుంది. కింగ్ కోబ్రా చావు అంచుకు చేరుతుంది. దాంతో కాకులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. చివరికి పాము రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను 'Latest Sightings' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తుంది. ఈ వీడియో 10 నెలల క్రితందే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2,944,326 వ్యూస్ వచ్చాయి. 


Also Read: Python Swallows a Big Cow: బాప్రే.. పెద్ద ఆవును మింగేసిన అనకొండ.. వీడియో చూసి షాక్ అవుతున్న జనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook