Mother Buffalo terrific Fighting Video: 'తల్లిని మించిన యోధుడు లేడు'.. ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు!

Mother Buffalo Heart Wrenching Video: ఇప్పటి వరకు ఎన్నో హృదయవిదారక వీడియోలు చూసి ఉంటాం కానీ ఇలా మాటలతోనే గుండెల్ని పిండేసే వివరణ ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటున్నారా ? ఇంతకీ గుండెల్ని తడిమేంతగా ఈ వీడియోలో ఏముంది అనే కదా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. ఇంకా మిమ్మల్ని మాటలతో ఆపలేం. గుండెల్ని పిండేసే ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 07:59 PM IST
Mother Buffalo terrific Fighting Video: 'తల్లిని మించిన యోధుడు లేడు'.. ఈ  వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు!

Mother Buffalo terrific Fighting Video with Lions: ఈ వైరల్ వీడియో చూస్తే ఎవరికైనా గుండెలు తరుక్కుపోవాల్సిందే. ఎంతటి కఠినాత్ములకైనా ఆపదలో చిక్కుకున్న ఆ దూడను.. అప్పుడే పుట్టిన తన దూడను కాపాడుకునేందుకు ఆ గేదె పడుతున్న తాపత్రయాన్ని చూస్తే.. వాటి కోసం సింహాలతోనైనా పోరాడాలని అనిపిస్తుంది. ఇలా వీడియో చూస్తూ ఏం చేయలేకపోతున్నాం కానీ ఆ స్థానంలో మనం ఉండి ఉంటే ఆ సింహాల బారి నుంచి దూడను, గేదెను కాపాడేందుకు ఏమైనా చేసేవాళ్లం అని అనిపించక మానదు. ఏం చేయలేకపోతున్నామే అనే బాధ గుండెల్ని పిండేస్తుంది. వీడియో చూస్తున్నంతసేపు మాత్రమే కాదు.. ఆ తరువాత కొన్నిరోజుల పాటు మిమ్మల్ని ఈ వీడియో మిమ్మల్ని వెంటాడుతుంది. 

ఇప్పటి వరకు ఎన్నో హృదయవిదారక వీడియోలు చూసి ఉంటాం కానీ ఇలా మాటలతోనే గుండెల్ని పిండేసే వివరణ ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటున్నారా..? ఇంతకీ గుండెల్ని తడిమేంతగా ఈ వీడియోలో ఏముంది అనే కదా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. ఇంకా మిమ్మల్ని మాటలతో ఆపలేం. గుండెల్ని పిండేసే ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి. కానీ కాస్త గుండెను బిగపట్టుకుని చూడండి. వీడియో చూశాకా మరో ముఖ్యమైన కోణాన్ని చర్చించుకుందాం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wildlife Stories (@wildlife_stories_)

చూశారు కదా ఈ వైరల్ వీడియో.. పుట్టిపుట్టిన వెంటనే ఆ దూడ ఆపదలో చిక్కుకుంది. ఒంటరిగా ఉన్న గేదెను, అప్పుడే పుట్టిన దూడను మూడ్నాలుగు సింహాలు చుట్టుముట్టాయి. ఆ సింహాల పంజా నుంచి దూడను కాపాడుకునేందుకు గేదె చేస్తోన్న పోరాటం చూస్తుంటే.. మాతృత్వం మనిషికైనా, జంతువుకైనా ఒక్కటేనని మరోసారి నిరూపించింది కదా అనిపిస్తుంది. 

ఇది కూడా చదవండి : Oldage Woman Stops Train: భారీ రైలు ప్రమాదాన్ని నివారించేందుకు రైలుకు ఎదురెళ్లిన బామ్మ

బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సింహాల నోటికి చిక్కకుండా తన దూడను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. తాను కూడా వాటికి ఆహారంగా మారకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఆ సింహాలు ముందుగా గేదెను.. ఆ తరువాత ఒంటరిగా మిగిలిన దూడను చంపుకుని తినేస్తాయి. ఆ ఒంటరి గేదె మీద విధి ఎంత విచిత్రంగా పగపట్టిందో చూశారా ? దూడను అక్కడే వదిలి అది పారిపోతే.. అది ప్రాణాలతో బయటపడొచ్చు.. కానీ ఆ గేదె అలా చేయలేదు. అప్పుడే పుట్టిన దూడను వదిలిపోయేందుకు దానికి మనసు రాలేదు. అదే కదా మాతృత్వం అంటే..

అయితే, ఈ వీడియో చూసిన వాళ్లంతా తాము ఏమీ చేయలేకపోతున్నామే అనే ఆవేదన ఒకటైతే.. ఈ వీడియోను చిత్రీకరించిన వాళ్లపై పట్టలేనంత కోపంతో విరుచుకుపడుతున్నారు. తామంటే ఏమీ చేయలేకపోతున్నాం కానీ.. ప్రత్యక్షంగా ఈ ఘటనను చూసిన వారికి ఆ సింహాలను అక్కడి నుంచి పారదోలి ఆ గేదెను, దూడను రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియో ఎలా షూట్ చేశారని నెటిజెన్స్ మండిపడుతున్నారు. నిజమే కదా.. దూడను కాపాడుకోవాలని ఆ నోరు లేని మూగజీవికి ఉన్న తపన.. వాటిని కాపాడాలి అని అన్నీ తెలిసిన మనిషికి లేకపాయేనె అనే బాధ ఇంకా ఎక్కువ కోపాన్ని తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : Python Snake Swallows Cow: పెద్ద ఆవును మింగిన భారీ ఆనకొండ.. ఈ టెర్రిఫిక్ వీడియో చూస్తే షాకవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News