King Cobra Crazy Hunting: ఎదురుగా ఏదున్నాసరే.. మాటు వేసిందంటే వేటు పక్కా.. ది కింగ్ ఆఫ్ స్నేక్స్ వేటాడటం ఎపుడైనా చూసారా.. ??
King Cobra Crazy Hunting: చాలా పాములను మనం చూసి ఉంటాం. కానీ పాములను చంపుకు తినే పాములను చూడడం చాలా అరుదు. అయితే మీరు ఈ వీడియో అలాంటి పాములను చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ సన్నివేశాలు చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.
King Cobra Latest Viral Video: చాలా మంది పాములను చూసి హడలిపోతారు. మరికొందరైతే వాటిని చూసి పరిగేత్తేవారు కూడా ఉంటారు. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే అధికంగా కనబడుతున్నాయి. వీటిని చూసేందుకే సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా చోరవ చూపుతున్నారు. ముఖ్యంగా స్నేక్ క్యాచర్స్ పాములను పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇందులో పలు వీడియోలు వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తే మరి కొన్ని వీడియోలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కొందరు స్నేక్ క్యాచర్స్ ఏ మాత్రం భయం లేకుండా తీవ్ర భయంకరమైన నాగు పాములకు కూడా ముద్దులు పెడుతున్నారు. అయితే వారి అది చేయడం ప్రమాదమని తెలిసినా.. ఏ మాత్రం భయపడకుండా వాటితో సహసోపేతమైన పనులు చేస్తున్నారు.
ఇటివలే వైరల్ అవుతున్న పాము వీడియోల్లో క్రేజీ 7 హంటింగ్ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మీరు ఈ వీడియోలో గమనిస్తే అతి భయానకమైన నాగు పాములు జంతువులను వేటాడే సన్నివేశాలు చూడొచ్చు. చాలా మంది ఈ సన్నివేశాలు చూసి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందలో కింగ్ కోబ్రా అతి కృరంగా ఇతర పాములను చంపుకు తినడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియోలో కింగ్ కోబ్రా నీటిలో ఈదుతూ ఇతర పాముని దారుణంగా వెంటాడి చంపుకు తినడం మరీ దారుణం..
కింగ్ కోబ్రాలు ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియా అడవుల్లో పలు ప్రాంతాల్లో విచ్చల విడిగా తిరుగుతూ ఉంటాయి. ఇవి చాలా విషపూరితమైన పాములు.. ఇది ఒక్క సారి మనిషిని కాటేస్తే మనిషి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పాములు చూడడానికి భయానకంగా ఉన్నప్పటికీ వీటి పొడవు 3.18 నుంచి 4 మీ వరకు ఉంటాయి. అయితే కొన్ని పాములైతే నివసించే ప్రదేశాలను బట్టి రంగు మారుతూ ఉంటాయి. ఎడారి ప్రాంతాల్లో పాములు నలుపు రంగులో ఉంటే అడవి ప్రాంతాల్లో జీవించేవి ఎక్కువగా గోధుమ బూడిద రంగులో ఉంటాయి.
ఈ వీడియోను మీరు గమణిస్తే ఈ సన్నివేశాలన్ని ఆగ్నేయాసియాలో చిత్రికరించారని తెలుస్తుంది. అయితే ఈ భయానకమైన సన్నివేశాలు కలిన వీడియోను టాప్ యానమల్స్ అనే యుట్యూబ్ చానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 11 నెలలైనా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ ఈ వీడియోను 4 లక్షల మందికి పైగా వీక్షించగా 2 వేల మందికి పైగా లైక్ చేశారు. కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకున్నారు. ఇలాంటి పాములను చూడడం చాలా ఆనందంగా ఉందని ఇంకా ఇలాంటి కొత్త వీడియోలను పోస్ట్ చేయాలని యుట్యూబ్ చానెల్‌ను కోరారు. మరి కొందరైతే ఈ వీడియోను చూసి భయాందోళనలకు గురయ్యమంటూ కామెంట్ చేశారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి