King Cobra Viral Video: 3 గంటల పాటు సరసాలాడిన నాగు పాములు.. ఇమ్రాన్ హష్మీ కంటే రొమాంటిక్‌గా ఉన్నాయే! వైరల్ వీడియో
King Cobra Mating Viral Video, Two King Cobras Doing Romance for 3 hours. తాజాగా రెండు పాములకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Two King Cobras Doing Romance for 3 hours: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, మనుషులకు సంబందించిన వీడియోలు నెట్టింట ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. సింహ, పులి, కుక్క, పిల్లి, కోతి, ఏనుగు, మొసలి, పాముల వీడియోస్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా రెండు పాములకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు పాములు గంటల తరబడి సరసలాడాయి.
ఈ భూ ప్రపంచంలో ప్రతి జీవికి ఓ సంభోగ కాలం ఉంటుంది. పాముల సంభోగం కాలం వేసవి ప్రారంభంతో ఆరంభం అవుతుంది. ఏప్రిల్, మే నెలలో పాములు సంభోగంలో పాల్గొంటాయి. అన్ని రకాల పాములకు వేసవి కాలమే సంభోగం సమయం. ఈ సంభోగం కాలం తర్వాత గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి. వేసవి కాలంలో అడవి, జనావాసం లేని ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే వాటికి ఇది సంభోగం సమయం కాబట్టి.
ఈ క్రమంలోనే రెండు భారీ నాగు పాములు సంభోగం చేస్తూ కొందరి కంట పడ్డాయి. ఇంకేముందు వారు వాటి రొమాన్స్ వీడియోను తీసి నెట్టింట పోస్ట్ చేశారు. వీడియో ప్రకారం... రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా నగరానికి సమీపంలోని బడి హర్ని గ్రామంలోని కలులాల్ జాట్ ప్లాట్‌లో రెండు నాగు పాములు సరసాలు (సంభోగం) ఆడాయి. ఏకంగా 3 గంటల పాటు అవి రెండు రొమాన్స్ చేశాయి. ఆ సమయంలో ఓ మనిషి వాటి వద్దకు వచ్చినా.. ఆ పాములు అసలు బెదరలేదు. మూడు గంటల అనంతరం అవి రెండు విడిపోయాయి.
ఇందుకు సంబందించిన వీడియోను జీ న్యూస్ రాజస్థాన్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 'ఇమ్రాన్ హష్మీ కంటే రొమాంటిక్‌గా ఉన్నాయే' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'బెస్ట్ లవ్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఈ వీడియోని మీరు చూడండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.