15 feet King Cobra Swimming in Pond at Kawasoti: ఎక్కువగా అడవుల్లో ఉండే పాములు కొన్నిసార్లు దారితప్పి మనుషుల ఇళ్లకు వస్తుంటాయి. కొందరు తమ కంట పడిన పాములను వేటాడి మరీ చంపుతుంటారు. మరికొందరు మాత్రం స్నేక్ హెల్పింగ్ సోసైటి వారికి సమాచారం ఇచ్చి పాములను రక్షిస్తుంటారు. ఇప్పటికే పాములను రక్షించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమ ఇంటిలో దూరిన భారీ కింగ్ కోబ్రాను చంపకుండా ఓ స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఏం జరిగింతో చూడండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేపాల్ దేశంలోని నవల్పూర్ జిల్లా కవసోటి మున్సిపాలిటీకి చెందిన గైరి గ్రామంలోని ఓ ఇంట్లోకి భారీ కింగ్ కోబ్రా దూరింది. ఇంటి సభ్యులు స్నేక్ క్యాచర్‌ హేం మహతోకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన హేం మహతో ఇంటికి చేరుకొన్నాడు. పాత ఇంట్లో ఓ మూలన ఉన్న  దాదాపుగా 15 అడుగులు ఉన్న కింగ్ కోబ్రాను స్టిక్ సాయంతో బయటికి తీసుకొస్తాడు. చాలా సులువుగా అతడు ఇంట్లో నుంచి పామును బయటికి తీసుకోకురావడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్ అవుతారు. 


ముందుగానే ప్లాన్ చేసిన ప్రకారం కింగ్ కోబ్రా సంచిలోకి వెళ్లేలా స్నేక్ క్యాచర్‌ హేం మహతో ప్రయత్నిస్తాడు. చాలా సమయం తర్వాత కింగ్ కోబ్రా సంచిలోకి వెళ్ళగానే.. అతడు అందులో బంధిస్తాడు. స్నేక్ క్యాచర్‌ ఆ సంచిని తీసుకుని ఓ చెరువు గట్టున వదులుతాడు. అప్పటికే బయపడిపోయిన కింగ్ కోబ్రా.. సంచిలోంచి బయటికి రాగానే చెరువులోకి దూసుకెళుతుంది.  చెరువులో చాలా వేగంగా ఈత కొడుతూ అవతలి ఒడ్డుకు క్షణాల్లో చేరుకుంటుంది. 



ఇందుకు సంబందించిన వీడియోను 'Hem Mahato' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో మూడు నెలల క్రితందే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. కింగ్ కోబ్రా నీటిలో ఇంత వేగంగా వెళుతుందా, పాము ఈత కొట్టడాన్ని చూడడం ఇదే మొదటిసారి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆలస్యం ఎందుకు వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.  


Also Read: న్యూజిలాండ్‌పై నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌ మాలిక్‌.. కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!


Also Read: NZ vs IND: టామ్‌ లాథమ్ భారీ సెంచరీ.. భారత్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.