Police Rescued King Cobra With Cpr Treatment Video Viral: కరోనా నుంచి బయటపడిన కొంతమందిలో అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. కూర్చున్న చోటే గుండెపోటు వచ్చి పడిపోవడం, బస్సుల్లో ప్రయాణించే క్రమంలో గుండెపోటు రావడం, డ్యాన్స్ చేస్తున్న క్రమంలో రావడం, కొంతమంది అయితే పెళ్లిళ్లు చూస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలడం ఇలా ఇటీవలే చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చాలామంది గుండెపోటుకు గురైన వారిని సిపిఆర్ పద్ధతి ద్వారా బ్రతికించగలిగారు. పిసిఆర్ పద్ధతి అనేది కృతిమంగా ఊపిరి అందించే విధానం. మనుషులు గుండెపోటుతో కుప్పకూలిన వెంటనే ఈ పద్ధతిలో చికిత్స చేస్తే వారిని సులభంగా బతికించుకో గలవచ్చు. మరి ఇదే చికిత్స జంతువులకు చేయొచ్చా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏ జీవికైనా ఈ సి పి ఆర్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల బ్రతికించగలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇటీవలే ఓ పోలీస్ ఆఫీసర్ పాముకు సిపిఆర్ చేసి బతికించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ కొన ఊపిరితో ఉన్న పాముకు సిపిఆర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించ గలిగాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం పట్టణంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే నర్మదాపురం పట్టణంలోని సేంద్రి హర్ చంద్ అనే ప్రాంతంలో ఓ ఇంట్లోని ఈ పాము చొరబడింది. అయితే అక్కడ ఉన్న స్థానికులకు ఇంటి యజమాని సమాచారం అందించగా, గుంపుల కొద్ది జనాలు అక్కడికి చేరుకున్నారు. 




దీంతో ఆ వారిని చూసి ఓ పైపులైన్ లో దూరుతుంది. అయితే అక్కడ జమైన స్థానికులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సమాచారం అందిస్తారు. దీంతో ఘటనా స్థలానికి ఆతుల్ శర్మ అనే ఆఫీసర్ చేరుకొని దానిని పట్టుకుని బయటికి లాగే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇంతకుముందే పాము బయటికి రావడానికి ఆ ఇంటి యజమాని పురుగుల మందు కలిపిన పండ్ల రసాన్ని పైపులైన్లోకి పోయడం వల్ల ఆ పాము అపస్మారక స్థితిలోకి చేరుకుంటుంది. అనంతరం ఆ ఆఫీసర్ పాముని బయటికి తీసి సిపిఆర్ పద్ధతిలో చికిత్స అందిస్తాడు. ఆయన ఆ పామును బతికించడానికి దాని తలను నోట్లో పెట్టుకుని కృతిమంగా శ్వాసను అందిస్తాడు. 


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


అయితే ఆ పాము కొద్దిసేపటి తరువాత బతికి అటు ఇటు తిరుగుతుంది.  అతుల్ శర్మ దాదాపు ఇప్పటివరకు 550 పాములకు పైగా రక్షించారని తెలిపాడు. ఆయన వీటిని రక్షించేందుకు దాదాపు 2008 సంవత్సరం నుంచి స్నేక్ క్యాచర్ గా కూడా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ఈ పాములను రక్షించే పద్ధతిని డిస్కవరీ ఛానల్ లో చూసి నేర్చుకున్నారన్నారు. ప్రస్తుతం ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆయనపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మీరు నిజమైన పోలీస్ ఆఫీసర్ అని కామెంట్లు చేస్తున్నారు.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి