King Cobra Naga Devi Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా వీటినే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో స్నేక్ క్యాచెస్ కూడా పాములు పట్టే క్రమంలో తీసిన వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? నెటిజన్స్ అంత ఆశ్చర్యపోవడానికి కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్వసాధారణంగా పల్లె ప్రాంతాల్లో పాములు జనావాసాల్లోకి సంచారం చేయడం సర్వసాధారణం. కొన్ని కొన్ని పాములు ఇంటి పరిసర ప్రాంతాల్లో మాత్రమే సంచారం చేస్తూ ఉంటాయి. కానీ ఈ వీడియో చూస్తే దీనికి భిన్నంగా ఉంది. ఓ పాము ఏకంగా దేవుని గదిలోకి వెళ్ళింది. దీంతో ఆ ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు.. చేరుకొని ఆ దేవుని గదిలో ఉన్న వామును వెతుకుతూ ఉన్నాడు. ఇంతలోనే ఆ పాము దేవుని ఫోటోలు దగ్గర దర్శనమిస్తుంది. అయితే స్నేక్ క్యాచర్ దీనిని గమనించి ఆ పాముని పట్టుకొని బయటికి లాగుతాడు. 
 
ఇలా స్నేక్ క్యాచర్ పాముని పట్టుకొని ఇంటి బయటికి వస్తాడు. అయితే అక్కడున్న స్థానికులు సాక్షాత్తు నాగదేవత గా భావించి ఆ పాముకు చిన్న గిన్నెలో పాలను పెడతారు. మరి కొంతమంది అయితే ఆ పామును చూసి సాష్టాంగ సంస్కారం కూడా చేస్తారు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ పామును ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించి అడవి ప్రాంతంలోని సురక్షిత ప్రదేశంలో వదిలేస్తాడు. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ఈ వీడియోను  @Mirzamdarif అనే యూట్యూబ్ ఛానల్ నుంచి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది అయితే ఆ నాగదేవతే సాక్షాత్తు ఇంట్లోకి ప్రవేశించిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 13వేల మందికిపైగా వీక్షించగా 18 మంది కామెంట్లు చేశారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter