King Cobra Viral Video: కాటేయడానికి మీదికి దూసుకొచ్చిన భారీ కింగ్ కోబ్రా.. జస్ట్ మిస్ అయితే వీడి పని గోవిందా..!
Snake Catcher easily escapes from King Cobras bite. ఓ స్నేక్ చామర్ సుమారు 14 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రా కాటు నుంచి చాలా ఈజీగా తప్పించుకున్నాడు. అంతేకాకుండా ఏం జరిగిందో మీరు తప్పకుండా చూడాల్సిందే..
Snake Charmer easily escapes from 14 feet King Cobras bite: ఇంటర్నెట్‌లో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని చాలా చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. ఇంకొన్ని వీడియోలను చూస్తే మాత్రం భయందోళనలకు గురవుతాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ స్నేక్ చామర్ సుమారు 14 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రా కాటు నుంచి చాలా ఈజీగా తప్పించుకున్నాడు.
ఇటీవల ఓ స్నేక్ షో జరిగింది. ఆ షోలో సుమారు 14 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి (Snake Charmer) ఆడిస్తున్నాడు. రింగ్ లోపల భారీ కింగ్ కోబ్రా పడగ విప్పి ఉంది. చుట్టూ ప్రేక్షకులు కూర్చుని ఆసక్తిగా చూస్తున్నారు. ఆడించే క్రమంలో స్నేక్ చామర్‌ను కాటేయడానికి కింగ్ కోబ్రా మీదికి దూసుకొచ్చింది. అయితే ఆ స్నేక్ చామర్ తన చేతితో పాము తల కింద చేయి పెట్టి వెనక్కి నెట్టాడు. దాంతో పాము కాటేయడానికి వెళ్లలేకుండా పోయింది. స్నేక్ చామర్‌లకు ఎన్నో టెక్నీక్స్ తెలిసి ఉంటాయనే విషయం తెలిసిందే.
https://youtube.com/shorts/3NjyB8KDWak?feature=share
స్నేక్ చామర్‌ను భారీ కింగ్ కోబ్రా కాటేయడానికి వచ్చిన వీడియో యూట్యూబ్ రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ రీల్‌ను 'Skitchfam' అనే యూసర్ పోస్ట్ చేశాడు. ఈ రీల్‌కు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకి 2 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. గ్రేట్ ఎస్కేప్, సూపర్ టెక్నీక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Kate Sharma Cleavage Pics: కేట్ శర్మ హాట్ ట్రీట్.. క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిందిగా!
Also Read: కింగ్ కోబ్రా ఈత కొట్టడం ఎప్పుడైనా చూసారా.. ఆలస్యం ఎందుకు ఈ వీడియో చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.