King Cobra Viral Video: పైకి లేస్తూ కాటేయటానికి వచ్చిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేసాడో చూడండి.. గూస్ బంప్స్ పక్కా..
Viral Video, Snake Catcher Akash Jadhav Catching 16 feet King Kobra. ఓడిశాలోని ఓ మారుమూల గ్రామంలో స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు.
16 ft aggressive King Kobra with Bare Hands: కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాములలో ఒకటి. 15 నుంచి 20 ఏళ్లు జీవించే కింగ్ కోబ్రాను నల్ల త్రాచు, రాచనాగు, గిరినాగు అని కూడా అంటారు. సాధారణంగా 12 నుంచి 20 అడుగుల పొడవు ఉండే కింగ్ కోబ్రా.. 3-4 అడుగుల ఎత్తున పడగ విప్పుతాయి. అంతపైకి పడగెత్తినప్పుడు కింగ్ కోబ్రాను చూసిన వారికి వెన్నులో వణుకుపుడుతుంది. కాటేసినపుడు కింగ్ కోబ్రా ఎక్కువగా విషం చిమ్మిస్తుంది కాబట్టి.. మనిషి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కాలిపోతాయి. బలమైన ఏనుగు కూడా కింగ్ కోబ్రా కాటుకు 15 నిమిషాల్లో మరణిస్తుంది కాబట్టే.. దానికి అందరూ భయపడతారు.
ఆకాష్ జాదవ్ అనే స్నేక్ క్యాచర్ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఓడిశాలోని ఓ మారుమూల గ్రామంలోని గుడిసెలో 16 అడుగుల పొడవున్న రేర్ కింగ్ కోబ్రా పట్టాడు. బ్లాక్ అండ్ బ్రోన్ కలర్‌లో కింగ్ కోబ్రా ఉంది. జగన్నాథ్ సాహు అనే వ్యక్తి గుడిసెలోని చూరులో 16 అడుగుల కింగ్ కోబ్రా ఉంది. పామును చూసిన సాహు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా బయపడిపోయారు. స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్‌కు సమాచారం ఇవ్వగా.. అతడు వచ్చి దాన్ని బయటికి తీశాడు.
గుడిసెలోంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్‌పై అటాక్ చేస్తుంది. అయినా కూడా అతడు భయపడకుండా దాన్ని బందించి సంచిలో వేస్తాడు. ఆపై కింగ్ కోబ్రా అడవిలో వదిలేస్తాడు. స్నేక్ క్యాచర్ జాదవ్ ఒట్టిచేతులతోనే భారీ పామును పట్టుకోవడం విశేషం. ఈ వీడియోను ఆకాష్ జాదవ్ త యూట్యూబ్ ఛానెల్ 'Sarpmitra Akash Jadhav'లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను అక్టోబర్ 20న పోస్ట్ చేయగా.. 4,187,496 వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఉప్పెనలా ఎగిసిపడుతున్న జాన్వీ కపూర్ ఎద అందాలు.. జూనియర్ శ్రీదేవిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి