Google History: గూగుల్ సెర్చ్‌లో తొలిసారిగా వెతికిన ఆ పదమేంటి, గూగుల్ ఎలా పుట్టింది
Google History: నిత్య జీవితంలో ఓ భాగం గూగుల్. కావల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది. లక్షలాది ప్రశ్నల్ని గూగుల్లో అణ్వేషిస్తుంటాం. ఈ గూగుల్‌లో తొలిసారిగా వెతికిన పదమేంటి, ఎలా సెర్చింగ్ ప్రారంభమైందనే వివరాల్ని తెలుసుకుందాం.
Google History: నిత్య జీవితంలో ఓ భాగం గూగుల్. కావల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది. లక్షలాది ప్రశ్నల్ని గూగుల్లో అణ్వేషిస్తుంటాం. ఈ గూగుల్‌లో తొలిసారిగా వెతికిన పదమేంటి, ఎలా సెర్చింగ్ ప్రారంభమైందనే వివరాల్ని తెలుసుకుందాం.
నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానం, ఎన్నో సందేహాల్ని నివృత్తి చేసే మార్గం గూగుల్(Google). తెలియనిది తెలుసుకునేందుకు గూగుల్ ఒక్కటే ఆధారమైన పరిస్థితి. ఏది కావాలన్నా సరే వెంటనే గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. రోజుకు లక్షలాది ప్రశ్నలు సెర్చ్ ఇంజన్‌ను తడిమేస్తుంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు గూగుల్ సెర్చ్ ఇంజన్ ( Google Search Engine)నిత్యం సెర్చ్ చేస్తూనే ఉంటుంది. ఇంతగా మనిషి జీవితంలో భాగంగా మారిన గూగుల్‌లో తొలిసారిగా సెర్చ్ చేసిన పదం ఏంటో తెలుసా.
గూగుల్ తొలిసారిగా సెర్చ్ చేసిన పదం (Google First Search Word)దాదాపు 23 ఏళ్ల క్రితం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు బ్యాక్‌రబ్ పేరుతో సెర్చ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. అప్పటికే ఇతర సెర్చ్ ఇంజన్‌లు ఉన్నా..పరిమితంగా ఉన్న సెర్చ్ ఆప్షన్‌ను పరిధి దాటేలా రూపొందించారు. 1998 సెప్టెంబర్ 5వ తేదీన బ్యాక్‌రబ్‌ను(Backrub)స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీ ఇంజనీరింగ్ స్కూల్ డీన్ జాన్ హెన్నెస్కీకు చూపించారు. ఆయన యూనివర్శిటీ ఛైర్మన్ గెర్‌హెస్ట్ కాస్పర్ పేరు టైప్ చేశాడు. వెంటనే ఆయనకు సంబంధించిన వివరాలు వచ్చేశాయి. మరో సెర్చ్ ఇంజన్‌లో మాత్రం వివరాలు రాలేదు. బ్యాక్‌రబ్ సాఫ్ట్‌వేర్‌ను ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు సృష్టించగా స్కాట్ హాసన్ కోడింగ్ అందించారు. అనంతరం అంటే 1998లోనే బ్యాక్‌రబ్ కాస్తా గూగుల్‌గా మారింది. గూగుల్ అనే పదం గూగోల్ పదం నుంచి పుట్టింది. దీనర్ధం టెన్ టుద పవర్ ఆఫ్ 100. అంటే అపరిమితమన్నమాట. అందుకే ఈ పేరు పెట్టారు. 2000 సంవత్సరం వచ్చేసరికి గూగుల్ అంతర్జాతీయమై..13 భాషల్లో విడుదలైంది. 2001 నుంచి గూగుల్ న్యూస్ (Google News), గూగుల్ బుక్స్, గూగుల్ స్కాలర్ అందుబాటులో వచ్చాయి. 2007లో సెర్చ్ ఇంజన్‌ను వర్టికల్‌గా మార్చి..యూనివర్శల్ సెర్చ్ ఇంజన్‌గా చేశారు. 2009లో గూగుల్ రియల్ టైమ్‌కు మారింది. ఫలితంగా లేటెస్ట్ ఆన్‌లైన్ అప్‌డేట్స్ కన్పించసాగాయి. 2010 నుంచి గూగుల్ లో హౌ, వై, వేర్, వాట్ అనే పదాలతో సెర్చింగ్ మొదలైంది. ఆ తరువాత అంటే 2012లో గూగుల్ వికీపీడియాకు (Google Wikipedia)వెళ్లడంతో ఎన్‌సైక్లోపిడీయాగా మారిపోయింది. ఇలా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌తో గూగుల్ నిత్య జీవితంలో భాగంగా మారిపోయింది.
Also read: Whatsapp New Feature: వాట్సప్ నుంచి సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ చూశారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook