Whatsapp New Feature: వాట్సప్ నుంచి సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ చూశారా

Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుంది, ఎలా వినియోగించాలనేది తెలుసుకుందామా  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2021, 10:32 AM IST
  • త్వరలో వాట్సప్ నుంచి కొత్త ఫీచర్లు
  • సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈమోజీలో పాటు మనీ హెయిస్ట్ ఈమోజీలు అందుబాటులో
  • ఇక నుంచి చాటింగ్‌కు తగ్గట్టుగా ఈమోజీలు పంపించుకునే అవకాశం
 Whatsapp New Feature: వాట్సప్ నుంచి సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ చూశారా

Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుంది, ఎలా వినియోగించాలనేది తెలుసుకుందామా

వాట్సప్ (Whatsapp)మెసేజింగ్ యాప్..యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్ చేస్తుంటుంది. కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంది. ఇప్పుడు కొత్తగా సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్‌ను (Super Entertainment Feature)అందుబాటులో తీసుకురానుంది. యాపిల్ ఐ మెసేజ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో మెసేజ్ రియాక్షన్ ఎమోజీ ఓ వైపు, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వెబ్‌సిరీస్ మనీ హెయిస్ట్ ఎమోజీలను( Money Heist Emojis)ప్రవేశపెట్టనుంది. 

వాట్సప్ పర్సనల్ అక్కౌంట్, పబ్లిక్ గ్రూప్స్‌లలో యూజర్ల మధ్య సంభాషణలు జరుగుతున్నప్పుడు సందర్భానికి తగ్గట్టుగా ఎమోజీలను పంపించాలంటే సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడిక ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు చాటింగ్‌కు అనుగుణంగా ఎమోజీలు పంపించుకోవచ్చు.ఇది కూడా ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్‌తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటాయని వాట్సప్ వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix)విడుదలైన మనీ హెయిస్ట్ వెబ్‌సిరీస్ సీజన్ 5కు చెందిన 17 ఎమోజీలు వాట్సప్ యూజర్ల కోసం అందుబాటులో రానున్నాయి. ఎప్పటి నుంచి అందుబాటులో వస్తాయనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులో తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలకు ( New IT Rules)అనుగుణంగా నడుచుకునే క్రమంలో..యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సప్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల 3 మిలియన్లకు పైగా ఖాతాల్ని నిషేధించింది. అందుకే కొత్త యూజర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఫీచర్లు (Whatsapp New Features)ప్రవేశపెడుతోంది. 

Also read: IT Refund Status: ఇన్‌కంటాక్స్ రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News