Kolkata Model Towel Dance: నేటి సోషల్ మీడియా యుగంలో రీల్స్ ద్వారా ఫేమస్ అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉందని చెప్పవచ్చు. చాలామంది తమలోని ప్రత్యేకమైన నైపుణ్యాలను, కళలను, లేదా ఆలోచనలను రీల్స్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది వారికి గుర్తింపు తెస్తుంది. మరి కొంతమంది తాత్కాలికంగా ఫేమస్ అవ్వడానికి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ తరహాలోనే  ప్రస్తుతం ఓ యువతి చేసిన పని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియో వివరాలు ఇలా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వైరల్‌ వీడియోలో @sannati_ అనే యువతి  రీల్స్‌ పిచ్చితో ఏకంగా ఇండియా గేట్ ముందు టవల్ విప్పి డ్యాన్స్ చేసింది. వీడియోలో యువతి ఇండియా గేట్‌ ముందు టవల్‌లో ఉండి '' మేరే ఖ్వాబోన్ మే జో"ఆయే పాటకు చిందులేస్తూ కనిపిస్తుంది. దిల్‌వాలే దుల్హనియాలే జాయేంగే సినిమాలోని ఈ పాటకు  కాజోల్‌ డ్యాన్స్‌ చేశారు. ఇందులో నటి కాజోల్‌ బాత్‌ రూమ్‌లో టవల్‌ వేసుకొని డ్యాన్స్‌ చేసింది. ప్రస్తుతం మోడల్‌ కూడా ఇదే తరహాలో ఇండియా గేట్‌ ముందు స్టెప్‌లు వేయడంతో నెట్టిజన్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇందులో  ట్విస్ట్ ఏమిటంటే ... డ్యాన్స్‌ చేసిన యువతి ఒక ఫేమస్ మోడల్‌ ఆమె పేరు  సన్నతి మిత్ర.  ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో 1.8M ఫాలోవర్స్ ఉన్నారు. సన్నతి మిత్ర 2017 మిస్‌ కోల్‌కత్తగా నిలిచింది. కానీ ప్రస్తుతం ఈమె టవల్ చుట్టుకొని డ్యాన్స్ చేసిన వీడియో నెట్టిజన్‌లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున ట్రోల్‌ కూడా చేస్తున్నారు. 


 


 



 


 


 


ఇకపోతే సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది.  చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కోరుకుంటారు. అందుకే ఏదో ఒక విధంగా వైరల్ అయ్యేలా రీల్స్ చేస్తుంటారు.
కొంతమందికి లైక్స్, కామెంట్లు ఎక్కువ వస్తే చాలు అనిపిస్తుంది. అందుకే వింత వింత రీల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సవాళ్లు, ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ రీల్స్ చేస్తుంటారు. 


 సోషల్ మీడియా అనేది ఒక రకంగా మన జీవితాలలోకి చొచ్చుకు వచ్చింది. ఇది మనకు ఎంతో ఉపయోగపడే సాధనం అయినప్పటికీ దీనిని కొంతమంది అతిగా ఉపయోగించడం లేదా దుర్వినియోగం చేయడం కూడా జరుగుతుంది. అధికంగా సమయం గడపడం వల్ల మనం మన ఇతర ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయవచ్చు.  ఇతరుల జీవితాలను చూసి మనం మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం, మనోవేదనకు గురవవచ్చు. కొంతమంది ఇతరులను అవమానించడం లేదా బెదిరించడం వంటి పనులు చేస్తున్నారు. 


ఇదీ చదవండి: ఇజ్రాయేల్‌ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్‌.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter