Koo app security threat: కూ యాప్ ఎంతవరకూ సురక్షితం, చైనా పెట్టుబడులు, డేటా లీక్ వార్తలతో ఆందోళన
Koo app security threat: రైతుల ఉద్యమం నేపధ్యంలో ట్విట్టర్ తో నెలకొన్న ఘర్షణతో కేంద్ర ప్రభుత్వం దేశీయమైన కూ యాప్‌ను ప్రొమోట్ చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 30 లక్షల డౌన్‌లోడ్‌లతో సంచలనమైన కూ యాప్ ఇంతకీ సురక్షితమేనా అనే సందేహాలు వస్తున్నాయి. డేటా లీక్ అయిందని..చైనా కంపెనీ పెట్టుబడులున్నాయని తెలుస్తోంది.
Koo app security threat: రైతుల ఉద్యమం నేపధ్యంలో ట్విట్టర్ తో నెలకొన్న ఘర్షణతో కేంద్ర ప్రభుత్వం దేశీయమైన కూ యాప్‌ను ప్రొమోట్ చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 30 లక్షల డౌన్‌లోడ్‌లతో సంచలనమైన కూ యాప్ ఇంతకీ సురక్షితమేనా అనే సందేహాలు వస్తున్నాయి. డేటా లీక్ అయిందని..చైనా కంపెనీ పెట్టుబడులున్నాయని తెలుస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ( Twitter ) తో కేంద్ర ప్రభుత్వం ( Central government )వార్ ప్రారంభమైంది. రైతుల ఉద్యమం నేపద్యంలో ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వానికి పొసగడం లేదు. ఈ నేపధ్యంలోనే దేశీయంగా అభివృద్ధి చెందిన కూ యాప్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ( Union minister piyush goel ) సహా ఇతరులు కూ యాప్‌లో చేరి..ట్వీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కూ యాప్ భద్రత ( Koo app security threat ) పైనే ప్రశ్నలు వస్తున్నాయి. కూ యాప్ ( Koo app ) సురక్షితం కాదని..డేటా ఇప్పటికే లీక్ అయిందని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. కూ యాప్..వినియోగదారుల ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, బర్త్ డేట్ సహా సున్నితమైన చాలా సమాచారాన్ని లీక్ చేస్తోందని ప్రముఖ ఫ్రెంచ్ భద్రతా పరిశోధకుడు రాబర్ట్ బాప్టిస్ట్ తేల్చి చెప్పాడు. అంతేకాదు..కూ యాప్‌తో చైనా కనెక్షన్‌ను చూపించే డొమైన్ రికార్డును కూడా షేర్ చేశాడు. అయితే బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగేళ్ల క్రితం క్రియేట్ చేసిన డొమైన్ అని..ఇప్పటికే అది చాలా చేతులు మారిందని తెలుస్తోంది.
కేవలం అరగంట కూ యాప్‌లో గడిపినప్పుడు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ ( Data leak from koo app ) చేస్తోందని గమనించినట్టు ఫ్రెంచ్ పరిశోధకుడు చెప్పాడు. గతంలో ఆధార్ వ్యవస్థతో పాటు ఇతర టెక్ సేవల్లో ఉన్న సెక్యూరిటీ లోపాల్ని ఎత్తి చూపించాడితడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రభుత్వ విభాగాలు, ఇతర సేవలు, మంత్రుల డేటాతో సహా మిలియనీర్ల సమాచారం లీక్ అయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆత్మ నిర్భర్ యాప్‌గా చెబుతున్న కూ యాప్‌లో చైనా కంపెనీ ( Chinese company investments in koo app )పెట్టుబడులుండటం ఆందోళన కల్గిస్తోంది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి అనుబంధ సంస్థ షున్ వేకి ఈ కూ యాప్‌లో పెట్టుబడులున్నాయి. షున్ వే వెంచర్ క్యాపిటన్ ఫండ్ సంస్థ. స్టార్టప్‌లలో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుంటుంది. షున్ వే కంపెనీ పెట్టుబడులున్నాయని ఇప్పటికే కూ యాప్ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ ధృవీకరించారు. ఈ క్రమంలో కూ యాప్ ఎంత వరకూ సురక్షితమనే విషయంలో సందేహాలు, ఆందోళన ఎక్కువవుతోంది. ట్విట్టర్ ( Twitter ) పై కోపంతో చైనా కంపెనీలతో సంబంధాలున్న యాప్‌లో చేరడం ప్రమాదకరమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే డేటా లీక్ అయిందని ఫ్రెంచ్ భద్రతా పరిశోధకుడు స్పష్టంగా చెబుతున్న పరిస్థితి ఉంది.
Also read: Twitter vs Koo: ట్విట్టర్‌కు పోటీగా కూ లో చేరిన మంత్రి..ట్విట్టర్‌లో ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook