Korean Girl Srivalli Dance: అల్లు అర్జున్ ను కాపీ కొట్టిన కొరియన్ బ్యూటీ- శ్రీవల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
Korean Girl Srivalli Dance: కొరియన్ ఉమెన్ డ్యాన్స్: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి, వాటిలో `శ్రీవల్లి` పాటపై కొరియన్ మహిళ యొక్క వీడియో వైరల్ అవుతోంది, ఇది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు.
Korean Girl Srivalli Dance: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'పుష్ప'. గతేడాది డిసెంబరు 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దాదాపుగా అన్నీ భారతీయ భాషల్లో కలిపి రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిందీ సినిమా. అయితే ఆ సినిమాకు సంబంధించిన ప్రతి సాంగ్, డైలాగ్, అల్లు అర్జున్ స్టెప్పులు వైరల్ గా మారుతున్నాయి.
ఈ సినిమాలోని శ్రీవల్లీ పాటకు ఎంతోమంది బన్నీని అనుకరిస్తూ వీడియోలు చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇదే పాటకు చాలామంది విదేశీయులు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలో విదేశీ క్రికెటర్లు, డ్యాన్సర్లు, సింగర్లు శ్రీవల్లీ పాటలో బన్నీ హుక్ స్టెప్పును అనుకరించారు.
తాజాగా కొరియాకు చెందిన ఓ అమ్మాయి.. శ్రీవల్లీ పాటకు హుట్ స్టెప్పు వేస్తూ వీడియో తీసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. 'శ్రీవల్లీ' సాంగ్ లో అల్లు అర్జున్ లాగా ముస్తాబయ్యి.. కళ్లు జోడుతో ఆ పాట హుక్ స్టెప్పుతో ఇన్ స్టాగ్రామ్ లో రీల్ చేసింది. ఇప్పుడా రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. korean.g1 అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ రీల్ పోస్ట్ చేశారు. ఈ రీల్ ను ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి లైక్ చేయగా.. లక్షల్లో వ్యూస్ లభించాయి.
Also Read: Shocking Video: నదిలోంచి ఒక్కసారిగా భూమి ఉబికి రావడం చూశారా ఎప్పుడైనా..ఎక్కడైనా
Also Read: Whatsapp New Feature: వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్, త్వరలో కవర్ ఫోటో సౌకర్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook