King Cobras Viral Video Today: ఈ భూ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సర్పాలలో కింగ్ కోబ్రా ఒకటి. భారత దేశంలో కింగ్ కోబ్రాను నల్లత్రాచు, రాచనాగు అని పిలుస్తుంటారు. సాధారణంగా 12-20 అడుగుల పొడవు ఉండే  కింగ్ కోబ్రా.. భారీ శరీరం కలిగి నల్ల రంగులో ఉంటుంది. ఇది తన పొడవులో మూడో వంతు వరకు పడగ ఎత్తుతుంది. పడగ ఎత్తినప్పుడు ఎదురుగా ఉన్న మనిషి కళ్లల్లోకి ఉగ్రరూపంతో చూస్తుంది. అప్పుడు మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనవుతుంది. అడవుల్లో నివసించే కింగ్ కోబ్రా.. కొన్నికొన్ని సార్లు జనావాసాల్లోకి వచ్చి హల్ చల్ చేస్తాయి. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన కింగ్ కోబ్రాను చూసి జనాలు పరుగులు తీస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనావాసాల్లోకి వచ్చే కింగ్ కోబ్రాలను ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్స్ మాత్రమే పడుతుంటారు. భారీ కింగ్ కోబ్రాలు అప్పుడప్పుడు స్నేక్ క్యాచర్‌లకు కూడా చుక్కలు చూపిస్తాయి. బుసలు కొడుతూ మీదికి దూసుకొస్తాయ్. ఈ క్రమంలో కొన్నిసార్లు స్నేక్ క్యాచర్స్ కూడా పాము కాటుకి గురవుతారు. అయితే ఇండినేషియాకు చెందిన ఓ ఇద్దరు సిస్టర్స్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా ఈజీగా పట్టేస్తారు. ఇద్దరు సిస్టర్స్ కూడా స్నేక్ క్యాచర్‌లే. ఈ ఇద్దరు ఇప్పటికీ ఎన్నో కింగ్ కోబ్రాలను పట్టేశారు. ఇల్లు, పార్క్, పొలాలలో ఎన్నో పాములను చాలా సునాయాసంగా పట్టారు. 



ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు (ఇద్దరు సిస్టర్స్) పట్టిన టాప్ కింగ్ కోబ్రా వీడియోలను 'KingCobra Hunter' అనే యూట్యూబ్ ఛానెల్లో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలో ఇద్దరు సిస్టర్స్ కలిసి భారీ భారీ కింగ్ కోబ్రాలను పట్టారు. ఐ ఇంటిలోని కుండలో దాగున్న రెండు పాములను పట్టడం హైలెట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు ఒక్కసారిగా హడలిపోయారు. ఇద్దరు సిస్టర్స్ టాప్ వన్ వీడియో అని నెటిజన్లు పేర్కొంటున్నారు. మీరు ఓసారి వీడియో చూసి ఆనందించండి. 


Also Read: IND vs NZ 2nd T20I: సూర్య సెంచరీ, నాలుగేసిన దీపక్.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం!


Also Read: Tejasswi Prakash Pics: తేజస్వి ప్రకాష్ హాట్ ట్రీట్.. బిగ్‌బాస్‌ బ్యూటీ అందాలు చూస్తే మతి పోవాల్సిందే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.