Langur paying tribute to Man who fed food: ప్రస్తుత సమాజంలో అన్నం పెట్టిన వారినే కడతేరుస్తున్న సంఘటలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. చినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని మానవ మృగాలు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా రాని దుర్మార్గులు ఉన్నారు. ఇలాంటి సమాజంలో తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ కొండముచ్చు విలవిలలాడిపోయింది. శవం వద్దకు వచ్చి ముద్దు పెట్టి నివాళులర్పించింది. ఈ ఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే... శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో కొండముచ్చు చాలా స్నేహంగా ఉండేది. కొండముచ్చు రోజూ ఇంటికి వచ్చి అతడు పెట్టే ఆహారం తినేది. అనంతరం కొండముచ్చు.. ఆ వ్యక్థితో సరదాగా ఆడుకొనేది. ఈ క్రమంలోనే కొండముచ్చు, వ్యక్తి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దురదృష్టవశాత్తు అక్టోబర్ 18న ఆ వ్యక్తి మరణించాడు. కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. 



రోజూలాగే ఇంటికి వచ్చిన కొండముచ్చుకు తన మిత్రుడు కనబడలేదు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు మృతదేహం చుట్టూ గుమిగూడారు. దీంతో మృతదేహం వద్దకు వెళ్లిన కొండముచ్చు.. అతడు చనిపోయాడని తెలియక ఆడుకొనేందుకు లేపే ప్రయత్నం చేసింది. ఎంతకూ లేవకపోయే సరికి.. కంటతడి పెడుతూ అతడికి ముద్దు పెడుతూ నివాళులర్పించింది. ఈ ఘటన అక్కడ ఉన్నవారి హృదయాలను కలిచివేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతొంది. వీడియో చూసిన అందరూ కొండముచ్చు ప్రేమను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. 


Also Read: Anakapalle King Cobra: అనకాపల్లిలో 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్.. స్నేక్ క్యాచర్‌లకి 2 గంటలు చుక్కలు చూపిందిగా!  


Also Read: Anasuya Bharadwaj: ఫారెన్ ట్రిప్‌లో అనసూయ.. అవి తప్ప ఏం లేవంటున్న స్టార్ యాంకర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook