Aadhaar and pan card link: మీ పాన్‌కార్డును ఆధార్ కార్డ్‌తో అనుసంధానించారా లేదా..లేకపోతే త్వరపడండి. మరో పదిహేను రోజులు మాత్రమే గడువుంది. ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్‌కార్డును (Pan Card) ఆధార్‌తో లింక్ చేయడం ఇప్పడు తప్పనిసరిగా మారింది. రెండింటినీ అనుసంధానించకపోతే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి చివరి తేదీ జూన్ 30. గతంలో మార్చ్ 31 వరకూ ఉన్న గడువును కరోనా మహమ్మారి కారణంగా మరోసారి పొడిగించారు. ఈసారి గడువు పొడిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ గడువులోగా లింక్ చేయకపోతే వేయి రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. 2021 ఆర్ధికబిల్లులో ప్రభుత్వం 234 హెచ్ సెక్షన్ ప్రవేశపెట్టింది కూడా. అందుకే ఒకేళ మీరు పాన్‌కార్డును ఆధార్ కార్డ్‌తో(Aadhaar Card)లింక్ చేయకపోతే..వెంటనే చేయండి. ఎలాగంటే..


ముందుగా https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. తరువాత కిందకు స్క్రోల్ చేసి పోర్టల్ హోమ్ పేజీలో ఉన్న లింక్ ఆధార్ ఆప్షన్ (How to link your Pan card with aadhaar card) క్లిక్ చేయండి. తరువాత మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీకు కన్పించే బాక్స్‌లలో పాన్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాల్ని ఎంటర్ చేయండి. అవసరమైన ఇతర వివరాల్ని నమోదు చేసి.లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఆరంకెల ఓటీపీ ఎంటర్ చేసి..లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరించండి.


Also read: Aviptadil Medicine: కరోనాకు కొత్తమందు, త్వరలో మార్కెట్లో అవిప్టడిల్ మందు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook